PBKS Vs MI: బుమ్ బుమ్ బుమ్రా.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌! వీడియో వైర‌ల్‌ | IPL 2024 PBKS Vs MI: Jasprit Bumrah Bamboozles Punjab Kings Batter With Perfect Delivery, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: బుమ్ బుమ్ బుమ్రా.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌! వీడియో వైర‌ల్‌

Published Fri, Apr 19 2024 9:39 AM

Jasprit Bumrah Bamboozles Punjab Kings Batter With Perfect Delivery - Sakshi

ఐపీఎల్‌-2024లో ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ రిలే రూసోను అద్బుతమైన యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బుమ్రా వేసిన బంతికి రూసో దగ్గర సమాధానమే లేకుండా పోయింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి సామ్‌ కుర్రాన్‌.. రూసోకు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో రూసోకు బుమ్రా అద్బుతమైన యార్కర్‌ వేశాడు. రూసో తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇది చూసిన రూసోకు ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్‌ అయిపోంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు  ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ బాల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పంజాబ్ కింగ్స్‌పై 9 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Advertisement
Advertisement