ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్‌

Published Thu, May 2 2024 5:50 PM

Ex Minister Ktr Fires On Bjp

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కమిషన్‌ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని.. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాముడి ఫొటోతో ఓట్లడిగిన వారిపై చర్యలేవీ? కేసీఆర్‌పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారంటూ మండిపడ్డారు

‘‘మతపరమైన రిజర్వేషన్లపై డైరెక్ట్‌గా ప్రచారం చేస్తున్న బీజేపీపై ఎందుకు మాట్లాడటం లేదు. మోదీ మాట్లాడిన మాటలకు నడ్డా సమాధానం ఇవ్వాలని తల తోక లేకుండా మాట్లాడింది ఎన్నికల సంఘం. అమిత్ షా రాముడు పటం పట్టుకొని ప్రచారం చేస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అధికారం కోసం ఎన్నికలలో రాముడ్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మోదీ, అమిత్ షా వాళ్ల బీజేపీ నేతలు ఇలా చేస్తుంటే ఇప్పటికీ చర్యలు తీసుకోరు. కానీ కేసీఆర్ ఒక్క మాట అన్నందుకు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు.

రైతుల సమస్యలు చెప్తూ మాట్లాడారు. చేనేత కార్మికుల గురించి కేసీఆర్వా రి బాధలు చెప్తూ భావోద్వేగంతో ఒక్క మాట అన్నారు. ఇలా చిన్న మాట అన్నందుకు 48 గంటలు నిషేధం విధించింది. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌పైనా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పై 8 సార్లు ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు లేవు. కేసీఆర్ తల నరకండి అంటే ఎందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం లేదు. 27 సార్లు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు’’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement