Sakshi News home page

ఐపీఎల్‌ 2024లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి.. టాప్‌లో కోహ్లి, బుమ్రా

Published Tue, Apr 23 2024 3:26 PM

Stats Till Match 38 In IPL 2024 - Sakshi

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు (38 మ్యాచ్‌లు) పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్‌ బెర్తులపై పూర్తి క్లారిటీ రానప్పటికీ ఓ అంచనా అయితే వచ్చింది. ప్రస్తుతం  రాజస్థాన్‌ రాయల్స్‌ (8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు) పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. కేకేఆర్‌ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సన్‌రైజర్స్‌ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సీఎస్‌కే (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ప్లే ఆఫ్స్‌ బెర్తుల కోసం ఈ ఐదు జట్ల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక​ జట్టుకు లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఆరు, ముంబై (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఏడు, ఢిల్లీ (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. 8 మ్యాచ్‌ల్లో రెండిట గెలిచిన పంజాబ్‌ తొమ్మిదో స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్‌ గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో పాతుకుపోయింది.

ప్రస్తుత సీజన్‌లో 70 మ్యాచ్‌లు (క్వాలిఫయర్స్‌, ఎలిమినేట్‌, ఫైనల్స్‌ కాకుండా) జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వ్యక్తిగత విభాగాల్లో (అత్యధిక పరుగులు, వికెట్లు) విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌లో కొనసాగుతున్నారు. 

విరాట్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 63.17 సగటున 150.40 స్ట్రయిక్‌రేట్‌తో 379 పరుగులు చేయగా.. బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి చహల్‌, హర్షల్‌ పటేల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. 

ఈ సీజన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న ఆటగాళ్ల వివరాలు..

  • అత్యధిక పరుగులు-విరాట్‌ కోహ్లి (379)
  • అత్యధిక వ్యక్తిగత స్కోర్‌-విరాట్‌ కోహ్లి (113)
  • అత్యధిక సగటు-రవీంద్ర జడేజా (141)
  • అత్యధిక స్ట్రయిక్‌రేట్‌-రొమారియో షెపర్డ్‌ (280.00)
  • అత్యధిక శతకాలు-బట్లర్‌ (2)
  • అత్యధిక హాఫ్‌ సెంచరీలు-రియాన్‌ పరాగ్‌, శాంసన్‌, క్లాసెన్‌, డికాక్‌ (3)
  • అత్యధిక బౌండరీలు-ట్రవిస్‌ హెడ్‌ (39)
  • అత్యధిక సిక్సర్లు- క్లాసెన్‌ (26)

బౌలింగ్‌ విషయానికొస్తే..

  •  అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్‌, హర్షల్‌)
  • ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక బౌలింగ్‌ సగటు లక్నో సంచలన పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ (9.0) పేరిట ఉంది. 
  • అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు-సందీప్‌ శర్మ (5/18)
  • (బుమ్రా,యశ్‌ ఠాకూర్‌, సందీప్‌ శర్మ.. ఈ ముగ్గురు చెరోసారి ఐదు వికెట్ల ఘనత సాధించారు)
  • అత్యుత్తమ సగటు-మయాంక్‌ యాదవ్‌ (6.00)

Advertisement

తప్పక చదవండి

Advertisement