మీ కోసం.. మా వంతుగా.. | Sakshi
Sakshi News home page

మీ కోసం.. మా వంతుగా..

Published Thu, Apr 18 2024 11:40 AM

- - Sakshi

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు నిహారిక బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ఏడో వార్డులో కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి నల్లపరెడ్డి గీతారెడ్డి, కోడలు పూజారెడ్డి ప్రచారం చేశారు.

కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ ఆయన కుమారుడు రామిరెడ్డి బాలసాకేత్‌రెడ్డి – మహిమ దంపతులు, కుమార్తె సంహిత – అఖిలేష్‌రెడ్డి దంపతులు 35వ వార్డులో కరపత్రాలు పంపిణీ చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకాణి గోవర్ధన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన కుమార్తె పూజిత ముత్తుకూరు పట్టణం బీసీ కాలనీ, ఎమ్మార్వో గిరిజన కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని కోరారు.

– ఉదయగిరి/బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌/కావలి/ముత్తుకూరు

ఉదయగిరి యాదవవీధిలో పూరీలు వేస్తున్న నిహారిక
1/1

ఉదయగిరి యాదవవీధిలో పూరీలు వేస్తున్న నిహారిక

Advertisement
 
Advertisement
 
Advertisement