టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమంగా పోరాడనప్పటికి.. సూపర్ ఓవర్‌లో మాత్రం పాక్‌కు భంగపాటు తప్పలేదు.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ 13 మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను కెప్టెన్ బాబర్ ఆజం(44), షాదాబ్ ఖాన్(40) పరుగులతో ఆదుకున్నారు. అమెరికా బౌలర్లలో నాస్తుష్ కెన్‌జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ దిగిన యూఎస్ఎ నిర్ణీత 20 ఓవర్లలో కూడా 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో నిర్ణయించాల్సి వచ్చింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విఫలమయ్యామని బాబర్ తెలిపాడు.
"తొలుత బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాం. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేపోయాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. ఏ మ్యాచ్‌లోనైనా గెలవాలంటే భాగస్వామ్యాలు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మేము అది చేయలేకపోయాం.
మరోవైపు బంతితో కూడా మేము నిరాశపరిచాం. మా స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదు. ఇలా అన్ని విభాగాల్లో విఫలమైనందన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఇక యూఎస్ఎ చాలా కష్టపడింది. కాబట్టి వారికి క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో మా కంటే మెరుగ్గా ఆడారని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment