దశాబ్ద కాలం తర్వాత డీఆర్‌సీ | Sakshi
Sakshi News home page

దశాబ్ద కాలం తర్వాత డీఆర్‌సీ

Published Thu, Jan 25 2024 8:36 AM

Review meeting on the development of Hyderabad - Sakshi

సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌ జిల్లా అభివృద్ధిపై బుధవారం సుమారు 4 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్ష సమావేశం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత డీఆర్‌సీ సమావేశ  దృశ్యం కనిపించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇన్‌చార్జి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్‌ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

శాఖల వారీగా పూర్తి స్థాయి వివరాలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ఆరా తీయడంతోపాటు సమస్యలను ఆయన నోట్‌ చేసుకున్నారు. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాఖాపరంగా  సమగ్ర అవగాహన, సమాచారం లేనివారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికైనా సమగ్ర సమాచారంతో రావాలని పలు శాఖల అధికారులను స్వల్పంగా మందలించారు. అధికారులు తమ విధులు, బాధ్యతలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం మాదిరిగా వన్‌సైడ్‌ నిర్ణయాలు తీసుకోవద్దని  సూచించారు. 

పరీక్షల్లో ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి 
త్వరలో జరగనున్న పదోతరగతి, ఇంటరీ్మడియట్‌ వార్షిక పరీక్షలకు సంబంధించి  ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి అని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సంబంధిత హెచ్‌ఎం, టీచర్, వార్డెన్‌లను నుంచి సమ్మతి లేఖ తీసుకోవాలని,  విద్యార్ధులు ఉత్తీర్ణత  సాధించకుంటే వారినే బాధ్యులు చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే  సంబంధిత అధికారులు  పాఠశాలలపై పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురుకులాలు, బీసీ వెల్ఫేర్‌ హాస్టళ్ల లో సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు.  
 
పరిష్కారానికి హామీ.. 
ప్రభుత్వ విభాగాల్లో పలు  పలు సమస్యలు, పెండింగ్‌ పనులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  రెండు మోడ్రన్‌ ధోబీఘాట్ల  పూర్తైనప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఉండడంతో మిషన్లు తుప్పుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని  ఉన్న తాధికారులను ఆదేశించారు  బీసీ హాస్టళ్లు అధిక శాతం ప్రైవేట్‌ భవనల్లో ఉన్నాయని వాటి సొంత భవనాల నిర్మాణం,  6 హాస్పిటళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జీఓ ఇచి్చందని, నిధులు విడుదల చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు. 

అధునాతన చేపల మార్కెట్‌ ఏర్పాటు 
నగరంలో అధునాతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. చేపల మార్కెట్‌ లేకపోవడంతో  వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తున్నారని, ప్రత్యేకంగా మార్కెట్‌ ఏర్పాటు చేసి మత్స్యకారులు, వినియోగదారులకు సౌకర్యం కలి్పస్తామన్నారు. కూరగాయల మార్కెట్‌లను సైతం రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. పెండింగ్‌  అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. 
 
కలెక్టరేట్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తాం..  
త్వరలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌కు నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. విశాలమైన స్థలంలో ఎవరూ ఊహించని విధంగా భారీ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. రేషన్‌ కార్డులు లేని వారికి సైతం కొత్తవి అందిస్తామని స్పష్టం చేశారు. 58, 59 జీఓకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.  

ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు 
రాబోయే వేసవితో పాటు  విద్య, వైద్యానికి సంబంధించి అత్యవసర పనుల కోసం ఒక్కో నియోజక వర్గానికి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు  మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన ‘జిల్లా స్థాయి సమీక్ష సమావేశం’ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల అత్యవసర సమస్యల పరిష్కారం కోసం తన కోటా నిధులు కేటాయించినట్లు తెలిపారు.  త్వరలో ఎమ్మెల్యే, ఎమెల్సీలు, ఎంపీలతో జిల్లా అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement