జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

Published Mon, Dec 23 2019 7:59 AM

Jharkhand Election Results: Counting of votes for 81 seats to begin  - Sakshi

సాక్షి, రాంచీ : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్‌ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది.  సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. మెజార్టీ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తుంటే, బీజేపీ తామే తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమాతో ఉంది. ఎవరి అంచనాలు నిజం కానున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది.

చదవండి: జార్ఖండ్‌ ఫలితాలు నేడే

Advertisement
 
Advertisement
 
Advertisement