'బీజేపీ టికెట్‌' నగేశ్‌కే.. | Sakshi
Sakshi News home page

'బీజేపీ టికెట్‌' నగేశ్‌కే..

Published Wed, Mar 13 2024 11:45 PM

- - Sakshi

ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం

బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలే కాషాయం పార్టీలోకి ‘గోడం’

సిట్టింగ్‌ ఎంపీ ‘సోయం’కు మొండిచేయి

బాపూరావు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం..?

ఆదిలాబాద్‌: బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేశ్‌ పేరునే ఆ పార్టీ అధిష్టానం ఖరా రు చేసింది. ఇటీవలే ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి కమలం పార్టీలో చేరగా తాజాగా టికెట్‌ కూడా ఆయనకే కేటాయించారు. సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపూరావు కు చుక్కెదురైంది. కాగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే లంబాడా సామాజిక వర్గంలో ఎవరికై నా టికెట్‌ ఇవ్వాలని ఆ సామాజికవర్గ నేతలనుంచి డిమాండ్‌ వ్యక్తం కాగా రాజకీయ సమీకరణల్లో భాగంగా ఈ స్థానాని కి ఆదివాసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు.

మహబూబాబాద్‌లో లంబాడా నేత సీతారాం నాయక్‌కు చోటు కల్పించగా, ఇక్కడ గోండు అయిన నగేశ్‌కు స్థానం కల్పించారు. దీంతో పార్టీ టికెట్‌ ఆశించిన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, జెడ్పీచైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, మార్కె ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జాదవ్‌ రాజేశ్‌బాబు, అభినవ్‌ సర్దార్‌, ఇతరులకు నిరాశ తప్పలేదు.

ఢిల్లీ పరిణామాల తర్వాత..
బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ గోడం నగేశ్‌ గత ఆదివారం ఢిల్లీలో కమలం పార్టీలో చేరారు.ఆ రోజు ఐదుగురు నేతలు కాషాయం కండువా కప్పుకోగా అందులో అజ్మీరా సీతారాం నాయక్‌, గోమాస శ్రీని వాస్‌,సైదారెడ్డితోపాటు నగేశ్‌కు ఈరోజు టికెట్‌ ఖ రారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే నగేశ్‌ పార్టీ లో చేరిన మరుసటి రోజే పార్టీలో టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు. వారితో పాటు పార్టీ ముఖ్య బాధ్యులు కూడా హస్తినకు చేరుకున్నారు. అగ్రనేతలను కలిశారు.

పార్టీలో కొత్తగా చేరే వారికి టికె ట్‌ ఇవ్వవద్దని, ఈ పార్లమెంట్‌ స్థానంలో సమర్థులై న నాయకులున్నారని, నగేశ్‌కు టికెట్‌ ఇస్తే సహకరించమని అధిష్టానానికి స్పష్టం చేశారు. దీంతో నగేశ్‌కు టికెట్‌ ఇవ్వకపోవచ్చనే ప్రచారం సాగింది. అయితే అధిష్టానం మాత్రం ఆ నేతవైపే ఆసక్తి కనబరుస్తూ ఎంపిక చేసింది. దీంతో ఆశావహులకు చుక్కెదురైంది.

మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో..
నగేశ్‌ మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆతర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా గా బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చే యనున్నారు. కాగా 2014లో పార్లమెంట్‌ ఎన్నికల కు ముందే ఆయన టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ బీజేపీ అభ్య ర్థి సోయం చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో బోథ్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్‌ దక్కలేదు.

బయోడెటా..
పేరు: గోడం నగేశ్‌
తల్లిదండ్రులు: భీమాబాయి, రామారావు
భార్య: లత (గృహిణి)
సంతానం: కూతురు మనోజ్ఞ(లా చదువుతోంది), కుమారుడు రిత్విక్‌(లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు)
కులం: ఎస్టీ (గోండు)
విదార్హతలు: ఎంఏ, ఎంఈడీ
పదవులు: 1994, 1999, 2009లో టీడీపీ నుంచి బోథ్‌ ఎమ్మెల్యేగా గెలుపు.
తొలిసారి గెలిచినప్పుడే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్టీఆర్‌ ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. 2014లో బీఆర్‌ఎస్‌లో చేరిక.. ఆదిలాబాద్‌ ఎంపీగా గెలుపు.
తండ్రి రామారావు రెండు సార్లు బోథ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో గిరిజన సంక్షేమశాఖమంత్రిగా పనిచేశారు.

ఇవి చదవండి: పారాచూట్లకే ప్రాధాన్యం!

Advertisement
Advertisement