
జీవితంలో అప్ అండ్ డౌన్‌లు సహజం. ఎప్పుడూ విజయాలే కాదు అప్పుడప్పుడూ అపజయాలు కూడా ఎదురవుతుంటాయి. అంత మాత్రాన వారి పని అయిపోయిందని భావించకూడదు. సినిమా రంగంలోనూ ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. పూజాహెగ్డే కెరీర్ చూస్తే 12 ఏళ్ల క్రితం ముగముడి అనే చిత్రం ద్వారా కథానాయికగా కోలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ చిత్రం నిరాశ పరచడంతో ఆమె చాప్టర్ ముగిసిందనే ప్రచారం జరిగింది. అయితే ఒక ద్వారం మూసుకుపోతే మరో ద్వారం తెరుచుకుంటుంది అంటారు. ఈమె విషయంలో అదే జరిగింది. కోలీవుడ్‌లో తొలి చిత్రమే అపజయం పాలైనా, టాలీవుడ్‌లో అవకాశాలు తలుపు తట్టాయి.
స్టార్ హీరోయిన్
ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అల వైకుంఠపురంలో, అరవింద సమేత, మహర్షి తదితర చిత్రాల విజయాలు పూజాను స్టార్ హీరోయిన్‌ను చేశాయి. అయితే ఆ తరువాత నటించిన రాధేశ్యామ్, ఆచార్య, తమిళంలో నటించిన బీస్ట్, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో నటించిన కిసి కా భాయ్ కిసికీ జాన్ వంటి చిత్రాలు అపజయం పాలవ్వడంతో పూజాహెగ్డే గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తరువాత అవకాశాలు కూడా దూరం అయ్యాయి.
చిన్న గ్యాప్
అలా ఈ అమ్మడికి గ్యాప్ వచ్చింది. అయితే అది చిన్నగ్యాప్ అనే అని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా టాలీవుడ్‌లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇకపోతే తమిళంలో ఒక వెబ్ సిరీస్‌లో నటించడానికి ఈ అమ్మడు పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఇమైకా నొడిగళ్, డీమాంటి కాలనీ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో పూజాహెగ్డే ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె హిందీలో దేవ సినిమా చేస్తున్నారు.
చదవండి: క్యాన్సర్ తర్వాత కథ, డైలాగ్స్ ఏవీ గుర్తుండట్లేదు!
Comments
Please login to add a commentAdd a comment