ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి! | Sakshi
Sakshi News home page

ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!

Published Sun, May 5 2024 11:06 AM

TDP Leaders Distributing Money In Nandyala

ఆశలు వదులుకుంటున్న టీడీపీ 

మైనార్టీ ఓట్లు పడవనే భయం 

ఇప్పటికే బీజేపీని పూర్తిగా దూరం పెట్టిన వైనం 

ప్రచారంలో ఎక్కడా కన్పించని కాషాయ కండువా 

టీడీపీలో చేరాలని ప్రత్యర్థి  కార్పొరేటర్లు, నేతలకు వల 

ఓటుకు రూ.2వేల చొప్పున పంచేందుకు సిద్ధం 

సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి. టీడీపీ నుంచి ఓ ‘బిజినెస్‌’మ్యాన్, వైఎస్సార్‌సీపీ తరపున ఓ ఉన్నత విద్యావంతుడు పోటీలో ఉన్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మినహా మరో అర్హత టీడీపీ అభ్యర్థికి లేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాధారణ కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువు, ఉద్యోగం చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పేదరికం విలువ తెలిసినోడు. పైగా తాను పోటీ చేసే సామాజికవర్గం మొత్తం తమ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థిలో గుబులు రేపుతోంది. 

ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1.15లక్షలు. నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించే ఓటర్లు వీరే. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఓట్లు తమకు రావనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అందుకే తన నామినేషన్‌ నుంచి ప్రచారం దాకా ఎక్కడా కాషాయ జెండా కనిపించలేదు. కషాయ జెండా, కమలం గుర్తు కనిపిస్తే బీజేపీ ఓట్లు దూరమవుతాయనేది ఈ అభ్యర్థి భావన. అయితే తన తండ్రి ఏకంగా బీజేపీలోనే ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ఇదే సమయంలో మైనార్టీ ఓటర్లకు మాత్రం ఈ దఫా ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓ స్పష్టత ఉంది. ఇది గ్రహించిన టీడీపీ అభ్యర్థి తండ్రి రంగంలోకి దిగి ప్రలోభాలకు తెరలేపాడు. 

ఒకరిది జన బలం.. మరొకరిది ధన బలం 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రజల మద్దతుతో గెలవాలనే భావనలో ప్రచారం చేస్తుంటే, టీడీపీ అభ్యర్థి తండ్రి మాత్రం డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాడు. ఓ టీంను నియమించుకుని, వారికి జీతాలు ఇస్తూ 50 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి పారీ్టలతో సంబంధం లేకుండా ఓ జాబితా సిద్ధం చేయించారు. వీరందరికీ ఫోన్లు చేసి స్వయంగా పిలిపించుకుని డబ్బులిస్తూ, తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. 

ప్రత్యర్థి పార్టీల నుంచి అనుకూలత లేకపోవడంతో తాను 2014, తన కుమారుడు 2019లో ఓడిపోయామని.. ఈ దఫా తన కుమారుడు ఓడిపోతే రాజకీయల నుంచి పూర్తిగా దూరం కావడంతో పాటు నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లి రాజకీయాలు చేసుకుంటారని చెబుతున్నారు. ఓడిపోతే హైదరాబాద్‌కు వెళ్లి రాజకీయాలు చేసేవాడు, గెలిచినా అదే చేస్తాడు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఏం పనికొస్తారని ప్రత్యర్థిపారీ్టల నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. ఇలాంటి వారికి మాకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. వైఎస్సార్‌సీపీ కోసం తిరగకుండా ఇంట్లో మౌనంగా కూర్చుంటే సరిపోతుందని సెలవిస్తున్నారు. ఒకరిద్దరు డివిజన్‌స్థాయి నేతలు ఆయన ప్రలోభాలకు లొంగడం మినహా తక్కిన వారంతా ధిక్కారస్వరం వినిపించడం గమనార్హం. 

ఓటుకు రూ.2వేల చొప్పున రూ.50కోట్లు పంచేందుకు సిద్ధం 
పోలింగ్‌ ఈ నెల 13న జరగనుంది. ఈ లోపు ఓటుకు రూ.2వేల చొప్పున 2.50లక్షల ఓట్లకు రూ.50కోట్లు పంచేందుకు నగదు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇళ్లతో పాటు తన వ్యాపార సముదాయాల్లో నగదు నిల్వలను ఉంచినట్లు సమాచారం. ప్రతీ ఎన్నికల్లో కేవలం 50శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ జరుగుతోంది. ఇందులో మైనార్టీ ఓట్లు అధికంగా పోలవుతాయి. ఆ తర్వాతి స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు. ఈ వర్గాలన్నీ వైఎస్సార్‌సీపీకి అనుకూలమనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. దీంతో వీరికి అవసరమైతే మరికొంత ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే కూటమి నేతలకు భారీగా ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ నేత సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఖర్చు విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తగువు 
నియోజకవర్గంలో ఓ సామాజికవర్గం ఓట్లు ఎన్ని, ఏ పారీ్టకి ఎవరు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని లెక్కలు వేశారు. దీంతో మైనారీ్ట, ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. ఎస్టీ, బీసీలు కూడా వైఎస్సార్‌సీపీ వైపు అధికంగా ఉన్నట్లు వారి లెక్కలో తేలింది. పోలింగ్‌కు కూడా వీరే ఎక్కువగా వస్తారు. దీంతో తక్కిన వర్గాల ఓట్లు తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేసి లెక్కలు వేస్తే తమకు పరాభావం తప్పదని తేలింది. 

అలాంటప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదని అభ్యర్థి తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ‘గత రెండు ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఈ దఫా ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మనకు సీటు కూడా ఇవ్వరు. కచ్చితంగా గెలవాలి. డబ్బులు చూడకూడదు’ అని తండ్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు వల్లనే ఇదంతా జరగుతోందని, పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబును కూడా నిషూ్టరమాడుతున్నట్లు చర్చ జరుగుతోంది.   

Advertisement
Advertisement