
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ నేతలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ కొత్త డ్రామాలకు తెర తీశారు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియా, చంద్రబాబుపు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబుకు బొమ్మ కనిపిస్తోంది. ఓటమిని ఏ శక్తీ ఆపలేదని అర్థమైంది. అందుకే అబద్ధాల వడగళ్లు కురిపించడానికి సిద్ధమయ్యాడు. అమలులోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. నార్త్ కొరియాలాంటి చోట ప్రభుత్వం భూములు లాక్కుంటుందేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో ఒకరి పేరుతో ఉన్న భూమిని ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం సాధ్యమా?’ అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు బొమ్మ కనిపిస్తోంది. ఓటమిని ఏ శక్తీ ఆపలేదని అర్థమైంది. అందుకే అబద్ధాల వడగళ్లు కురిపించడానికి సిద్ధమయ్యాడు. అమలులోనే లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. నార్త్ కొరియాలాంటి చోట ప్రభుత్వం భూములు లాక్కుంటుందేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 5, 2024
అలాగే, ‘న’మ్మక’స్తుడైన రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ చౌదరి పార్టీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాడని టీడీపీ శ్రేణులు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబుకు తప్పుడు సలహా ఇచ్చి కొంపముంచాడని కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 67 లక్షల ఫించను లబ్దిదారులు, వాళ్ల కుటుంబసభ్యులను చేతులారా దూరం చేసుకున్నామని తలలు బాదుకుంటున్నారు. మరో వారంరోజుల్లో ప్రచారం ముగుస్తుండగా ఇప్పుడీ విషమ సమస్య నుంచి బయటపడేది ఎలాగా అని కుమిలిపోతున్నారు’ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
న’మ్మక’స్తుడైన రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ చౌదరి పార్టీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాడని టీడీపీ శ్రేణులు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబుకు తప్పుడు సలహా ఇచ్చి కొంపముంచాడని కార్యకర్తలు ఆగ్రహావేశాలు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 5, 2024