నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే.. | Sakshi
Sakshi News home page

నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే..

Published Wed, Jun 29 2022 4:59 PM

Born With A Cleft Lip and Failing Liver My Son Needs A Transplant To Live - Sakshi

పిల్లాడికి పాలు పట్టడం కష్టంగా మారుతోంది సంగీతకు. ఎందుకుంటే ఆమె పొత్తిళ్లలో ఉన్న నాలుగు నెలల రిహాన్‌కు పుట్టుకతోనే గ్రహనమొర్రి ఉంది. దీంతో చనుబాలు తాగడం కష్టమయ్యేది. ఆకలితో గుక్కపట్టి ఏడ్చేవాడు. కానీ ఇటీవల మరో సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి రిహాన్‌ ఆరోగ్యం మరింతగా చెడిపోవడం మొదలైంది. పొట్ట ఉబ్బిపోయింది. కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. వెంటనే ఆలస్యం చేయకుండా రిహాన్‌ను ఆస్పత్రికి తీసుకుళ్లారు సంగీతా, సుబ్రదీప్‌లు.

రిహాన్‌కు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ప్రొగ్రసివ్‌ ఫ్యామిలియల్‌ ఇంట్రాహెపాటిక్‌ కొలెస్టాసిట్‌ (లివర్‌ వ్యాధి) ఉన్నట్టుగా తేల్చారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆ పసివాడి లివర్‌ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అర్జంటుగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయకుంటే పసివాడి ప్రాణాలకే ‍ ప్రమాదమని చెప్పారు. దీని కోసం అదనపు పరీక్షలు చేయగా సంగీత లివర్‌ మ్యాచ్‌ అయ్యింది. అయితే ఆపరేషన్‌కు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు.

రిహాన్‌ తల్లిదండ్రులైన సంగీత, సబ్రదీప్‌ ఇద్దరు వికలాంగులే. సుబ్రదీప్‌కు వినికిడి సమస్య ఉండగా సంగీతకు రెండు కాళ్లు సమానంగా లేవు. దీంతో అను నిత్యం వాళ్లు అనేక ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఏకైక ఆశా కిరణం, వారి ముద్దుల బిడ్డ రిహాన్‌. కానీ ఇప్పుడు రిహాన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.


మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

రోజులు గడిచే కొద్ది రిహాన్‌ మృత్యువుకు చేరువ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు దాతగా లివర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్‌కి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడం ఆ దంపతులకు అసాధ్యంగా మారింది. దీంతో తమ కొడుక్కి జరిగే లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు. ఆ పిల్లాడి ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి.(అడ్వెర్‌టోరియల్‌)

మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement