తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు

Published Fri, Dec 22 2023 11:16 AM

New Corona Cases Registered In Telugu States - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్  సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు.

ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే  రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు.

తాజాగా హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్‌ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్‌ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement