● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే! | Sakshi
Sakshi News home page

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!

Published Mon, May 6 2024 2:05 AM

● ప్ర

సూళ్లూరుపేట : సాక్షి బృందం విలేజ్‌ విజిట్‌ పేరుతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అటు అడుగుపెట్టగానే.. సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మది నుంచి పుట్టుకొచ్చి సాక్షాత్కరించిన అభివృద్ధి పనులన్నీ ఠక్కున లేచి గుడ్‌మార్నింగ్‌ అంటూ విష్‌ చేశాయి. గ్రామాల్లో వెలిసిన ప్రభుత్వ భవనాలు.. పట్టణాల్లో రూపుదిద్దుకున్న పార్కులు.. గ్రామాలకు ఏర్పాటైన రోడ్లు.. రైతులకు అందుబాటులోకి వచ్చిన అగ్రిల్యాబ్‌లు.. రైతు భరోసా కేంద్రాలు ముందు నాగురించే రాయండి అంటూ చెతులెత్తడం ప్రారంభించాయి. ముందుగా ఓజిలి మండలానికి వెళ్లగా అక్కడ ‘అందరికీ ఆరోగ్యం పంచేది నేనే కదా’ అంటూ ‘నాడు–నేడు’ పథకంలో రూ.1.2 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం లేచి నిలబడి నా గురించంటే నాగురించి ముందు రాయమని కూర్చినింది. అక్కడి నుంచి పెళ్లకూరు మండలంలోని పాలచ్చూరుకు వెళ్లగా.. అక్కడ ‘రైతులంటే గుర్తొచ్చేది సాగునీరే కదా’.. అంటూ.. రూ.38 కోట్లతో నిర్మించిన పాలచ్చూరు సప్లయ్‌ చానెల్‌ చేయి పైకి లేపింది. తరువాత నాయుడుపేట పట్టణంలోకి అడుగుపెట్టగానే ‘ఆహ్లాదానికి మారుపేరు నేను కాదంటారా..?’ అంటూ లేచి నిలబడింది.. రూ.1.5 లక్షలతో నిర్మించిన మున్సిపల్‌ పార్కు. అక్కడి నుంచి దొరవారిసత్రం మండలం, నెలబల్లి గ్రామానికెళ్లగా.. ‘ప్రగతి అంటే ఇదే కదా’ .. కావాలంటే వచ్చి చూడండి.. లేకుంటే అభివృద్ధి గురించి మీరు రాయనట్టే నంటూ సవాల్‌ విసిరాయి అక్కడ ఒకే సముదాయంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు. ఆ తర్వాత సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరులో పర్యటించగా.. అక్కడ ‘ఇళ్లుకాదు.. ఊళ్లు వెలిశాయి చూడండి’ అంటూ.. జగనన్న కాలనీ చెప్పుకొచ్చింది. తరువాత సూళ్లూరుపేట రూరల్‌ ప్రాంతంలోని ఇలుపూరు వద్దకెళ్లగా ‘ప్రగతికి రహదారి ఇదే కదా’ కావాలంటే చూసి వెళ్లండని రూ.6 కోట్లతో నిర్మించిన సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి రోడ్డు ఉప్పొంగిపోయింది. ఆఖరుగా తడ మండలం, కొండూరు పంచాయతీ పులివేంద్రంలో పర్యటించగా.. ‘రైతుకు ఎలాంటి మేలుచేయొచ్చో దీనిద్వారా తెలియజేయచ్చు’ అంటూ.. రూ.1.16 కోట్లతో నిర్మించిన అగ్రిల్యాబ్‌ భవనం చేయి ఊపింది..’ ఇలా రాసుకుంటూ పోతే.. ఏటిని ఎంచుకోవాలి.. ఎవరికి గురించి రాయాలి! ‘మళ్లీ వస్తాం..ప్రగతిని పదుగురికీ పంచుతాం’ అంటూ అక్కడి నుంచి సాక్షి బృందం నిష్క్రమించింది..!

పెళ్లకూరు మండలం, పాలచ్చూర సప్లయ్‌ చానల్‌ పునర్నిర్మాణం

ప్రజారోగ్యం..మరింత ఆహ్లాదకరం

నాయుడుపేట పట్టణం నడిబొడ్డున ఆక్రమణలతో దుర్గాంధ భరితంగా ఉండే పడమటి వీధిని గాంధీపార్కుగా తీర్చిదిద్దారు. రూ.1.5 కోట్లతో అధునాతనంగా మార్చేశారు. దీనివల్ల పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల చిన్న పిల్లలు మొదలుకొని మహిళలు, యువత, వృద్ధులు అందరికీ ఆహ్లాదం కలిగిస్తోంది. మాట ఇస్తే మరిచిపోకుడా పనులు చేసిపెట్టే వారు మనల్ని పాలిస్తే అందరూ హాయిగా ఉంటారని రుజువు చేశారు. – గంధవళ్లి ప్రవళ్లిక, నాయుడుపేట పట్టణం

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున
1/4

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున
2/4

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున
3/4

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున
4/4

● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున

Advertisement
Advertisement