Sakshi News home page

Oct 12th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Oct 12 2023 7:15 AM

TDP Chandrababu In Rajahmundry Central Jail Live Updates - Sakshi

Live Updates..

09:13 PM
చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు: హెల్త్‌ బులిటెన్‌
►చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన జైలు అధికారులు
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది
బీపీ: 140/80
టెంపరేచర్‌: నార్మల్
పల్స్: 87
Spo2: 97
Heart: s1 s2
Lungs: క్లియర్ 
ఫిజికల్ యాక్టివిటీ : గుడ్


►చర్మ సంబంధిత సమస్య గురించి చంద్రబాబు జైలు అధికారులకు తెలియజేశారు
►జైల్లో వైద్యాధికారిణి పరీక్ష చేసి మాకు నివేదిక ఇచ్చారు
►మా అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారు
►చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది 
►ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు 
:::రాజ్ కుమార్ , డిప్యూటీ సూపరిండెంట్‌, రాజమండ్రి కేంద్ర కారాగారం

08:46 PM
సుప్రీంకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ 
►సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు
►ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్  పిటిషన్ దాఖలు
►మంగళగిరి పోలీస్ స్టేషన్ హెడ్‌(SHO) ను ప్రతివాదిగా  చేరుస్తూ పిటిషన్

08:38 PM
రేపు సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌ విచారణ
►రేపు చంద్రబాబు లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ
►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం
►సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా ? లేదా? అన్నది తేల్చనున్న సుప్రీం కోర్టు 
►చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన హరీష్ సాల్వే
►రేపు సీఐడీ తరపు వాదనలు వినిపించనున్న రోహత్గి, రంజిత్ కుమార్ 

 07:35 PM
మరికాసేపట్లో చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు డెర్మటాలజీ ప్రాబ్లం
►స్పెషలిస్ట్ వైద్యులకు రిఫర్ చేసిన జైలు అధికారులు
►చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన రాజమండ్రి జీజీహెచ్ డెర్మటాలజిస్టులు
►కొన్ని మెడిసిన్స్, లోషన్లు వాడాలని సూచించిన వైద్యులు 
►చంద్రబాబు ఒంటిపై రేషస్‌తో అలర్జీ:డాక్టర్‌ సత్యనారాయణ
►చర్మ సమస్యకు మందులు రాసిచ్చాం:డాక్టర్‌ సత్యనారాయణ
►మరి కొద్దిసేపట్లో చంద్రబాబు హెల్త్ బుల్ టెన్ విడుదల చేయనున్న జైలు అధికారులు

07:15 PM
ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?
సీఎంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే.. మంత్రి హోదాలో కొడుకు నారా లోకేష్ కూడా అవినీతి బాటలోనే..  
కేవలం పాలు, పెరుగు వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని నారా భువనేశ్వరి అనడం జోక్‌
పాలు, పెరుగుతో కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపి ఫైబర్ నెట్ లో స్కాం జరిగింది
:::ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పున్నూరు గౌతమ్ రెడ్డి

06:55 PM
రాజమండ్రి జైలుకు చేరుకున్న వైద్య బృందం
►టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు స్కిన్‌ అలర్జీ
►జైల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన జీజీహెచ్ వైద్య బృందం
►చంద్రబాబును పరీక్షించనున్న డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీతల బృందం
 

06:31 PM
ముగిసిన నారాయణ అల్లుడి విచారణ.. మళ్లీ పిలిచే ఛాన్స్‌
►ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ విచారణ
►అమరావతిలో భూముల కొనుగోలు లావాదేవీల పై ప్రశ్నించిన సీఐడీ
►సీఐడీ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పునీత్
►మాటి మాటికి కార్ లోకి వెళ్లి ఫోన్ మాట్లాడి విచారణకు హాజరైన పునీత్
►ఎన్ స్పైరా నుండి ఎందుకు రామకృష్ణ హౌసింగ్ కి డబ్బులు పంపారు?
►రామకృష్ణ హౌసింగ్ నుండి మళ్ళీ నిధులు ఎందుకు ఎన్ స్పైరా సంస్థకు వచ్చాయి?
►అమరావతిలో చట్టవిరుద్దంగా అసైన్డ్ భూములు ఎందుకు కొనుగోలు చేశారు?
►అమరావతి రైతులకు చెల్లించే కౌలు మొత్తం నారాయణ సంస్థల ఖాతాలోకి ఎందుకొచ్చాయి? 
►నారాయణ ద్వారా IRR  అలైన్మెంట్ మార్పుల సమాచారం పొందిన విషయంపై ప్రశ్నలు
► పునీత్ ని మరోసారి సీఐడీ ప్రశ్నించే అవకాశం

06:12 PM
చంద్రబాబు కోసం డెర్మటాలజిస్ట్‌
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు 
►చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య
►వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు
►రాజమండ్రి జీజీహెచ్ నుంచి డెర్మటాలజిస్టు రాక 
►వెను వెంటనే పరీక్షలు చేయించిన జైలు అధికారులు
►చంద్రబాబు విషయంలో నిరంతరం అలర్ట్ గా ఉన్న జైలు అధికారులు
►జైలు వద్ద గట్టి భద్రత కూడా

05:30 PM
చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత
►రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు నాయుడికి స్వల్ప అస్వస్థత 
► చర్మ సంబంధితగా గుర్తింపు
►చర్మ వ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంటుకు లేఖ
►అత్యవసరంగా పంపించాలని లేఖలో వినతి
►ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరును కేటాయించిన జీజీహెచ్ అధికారులు


4:52 PM
అమిత్‌ షాకు అన్నీ చెప్పా: నారా లోకేష్‌
►కేంద్ర హోం మంత్రి కలవాలనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్‌ చేశారు.
►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై హోం మంత్రి అమిత్‌ షాకు అన్ని విషయాలు వివరించా.
►చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాను.
►ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పాను.
►సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు.
►అన్నింటి గురించి అమిత్ షాకు చెప్పా.
►అరెస్ట్‌లో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు.
►నిజం వైపు ఉండాలని అమిత్‌ షాను కోరా. 

04:20 PM
ఫైబర్‌నెట్‌ పీటీవారెంట్‌కు కోర్టు అనుమతి
►ఫైబర్‌నెట్‌ కేసులో కీలక పరిణామం
►చంద్రబాబు పీటీ వారెంట్‌ను ఆమోదించిన ఏసీబీ కోర్టు
►పీటీ వారెంట్‌ దాఖలు చేసిన సీఐడీ పోలీసులు
►సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశం
►ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలన్న కోర్టు
►రేపటి సుప్రీం తీర్పు వస్తే.. ఇంటర్వెన్‌ కావొచ్చని బాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచన

03:13 PM
లోకేష్‌ ప్రధాన అనుచరుడి ఇంట ఐటీ సోదాలు
►టీడీపీ నేత, నారా లోకేష్‌ ప్రధాన అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో  ఐటీ సోదాలు
►కాకినాడలో.. మూడు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
►దాదాపు 5 గంటలకు కొనసాగుతున్న సోదాలు
►ఆక్వా, క్వారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి
►ఆదాయంలో తేడాలు చూపించి  ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ
►బినామీ ల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన్నట్లు గుర్తింపు

02:51 PM
ఒక్క సెంట్‌ భూమి కూడా పంచని ఘనత చం‍ద్రబాబుది
చంద్రబాబు జైల్లో కూర్చుంటే  సొంత పుత్రుడు  బాగానే ఉన్నాడు
►దత్తపుత్రుడు మాత్రం రోడ్లు మీద దొల్లుతున్నాడు
►గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు 
►ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చి కొత్తగా ఊర్లు నిర్మించిన ఘనత సీఎం జగన్‌ది
►ఓట్లు లేని విద్యార్థులు కోసం కూడా 65వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్‌ సర్కార్‌ది
:::మంత్రి కారుమూరి కామెంట్స్ 



02:10 PM
అమ్మా.. మీ మరిది అవినీతికి పాల్పడ్డాడు
►చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు
►13సార్లు సంతకం పెట్టినా.. చట్టం వర్తింపజేయడానికి వీల్లేదని ఢిల్లీలో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. 
►ఒక ఫేక్‌ ఎగ్రిమెంట్‌తో స్కిల్‌ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది.
►ఆ ఒప్పందం ఫేక్‌ అని.. తమకు సంబంధం లేదని సీమన్స్‌ కంపెనీ కూడా ధ్రువీకరించింది.
►సాక్షాత్తు మీ మరిది ఆ డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా ఎలా రూట్‌ చేశారో.. ఆయన పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది.
►అంతేకాదు రూ.119 కోట్లకు సంబంధించి వ్యవహారంలో నోటీసులు కూడా ఇచ్చింది
►బీజేపీ ఏపీ చీఫ్‌ పురందేశ్వరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్‌

02:09 PM
ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు అర్హుడు కాడు
►అంగళ్ల విధ్వంసం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
►తీర్పు రిజర్వ్‌ చేసి రేపు వెల్లడిస్తామన్న కోర్టు
►పోలీసుల తరఫున న్యాయవాదుల వాదనలు 
►చంద్రబాబు నాయుడు అంగళ్ళలో కార్యకర్తలను రెచ్చగొట్టాడు
►చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఎలా రెచ్చగొట్టాడో మా దగ్గర ఆధారాలు ఉన్నాయ్‌
►అంగళ్ళలో  చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిన వీడియోలను పెన్ డ్రైవ్ లో న్యాయస్థానానికి అందించిన లాయర్లు
►ఈ కేసులో చంద్రబాబు నాయుడు కి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దు
►ముందస్తు బెయిల్ కు చంద్రబాబునాయుడు అర్హుడు కాడని వాదించిన పోలీసుల తరపు లాయర్లు

1:35 PM
అంగళ్లు కేసుపై రేపు కోర్టు తీర్పు..
►అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►కేసుపై కోర్టులో పూర్తైన ఇరుపక్షాల వాదనలు
►తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు
►రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడిస్తామన్న కోర్టు. 
►స్కిల్‌ స్కాం కేసులో లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 
►41A నోటీసులు ఫాలో అవుతామని చెప్పిన సీఐడీ లాయర్లు. 
►లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు. 

1:00 PM
యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది?
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు
►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన
►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు
►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు
►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు 
►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను
►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్
►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం
►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్
►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు
►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్‌
►ఎన్టీఆర్‌ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్‌.

11:45 AM
లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►స్కిల్‌ స్కాంలో లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 
►ముందస్తు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా
►విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

11:00 AM
చంద్రబాబుకు మళ్లీ ఎదురుదెబ్బ
►చంద్రబాబుకు హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది
►చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈనెల 17కు వాయిదా
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
►స్కిల్‌ స్కాంలో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌
►ఏసీబీ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌
►విచారణను వాయిదా వేసిన హైకోర్టు
►కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం.

10:20 AM
రెండో రోజు సీఐడీ ఆఫీసుకు నారాయణ అల్లుడు పునీత్‌
►ఏపీ సీఐడీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ 
►రెండోరోజు పునీత్‌కు విచారించనున్న సీఐడీ
►అమరావతి ఐఆర్‌ఆర్‌ అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఐడీ విచారణ
►పునీత్ నిర్వహిస్తున్న సంస్థ నుండి ఐఆర్‌ఆర్‌ పరిధిలో భూముల కొనుగోలు
►నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు
►నారాయణ సంస్థల నుండి జరిగిన ఆర్థిక లావాదేవీలపై పునీత్‌ను విచారించనున్న సీఐడీ
 

10:15 AM
పురంధేశ్వరికి కౌంటర్‌..
►బాబు అరెస్ట్‌ వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలకు పురంధేశ్వరి సమాధానమేంటి?.
►బావను కాపాడాలనే ఆరాటంలో అసలు విషయం మరిస్తే ఎలా..

8:40 AM
ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు విచారణ
►చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది వాదన  
►పీటీ వారెంట్‌పై సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు 
►పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతి 
►ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు విననున్న ఏసీబీ కోర్టు 
►వాదనలు అనంతరం నిర్ణయం వెల్లడించనున్న ఏసీబీ కోర్టు
►అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ 
►అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు
►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

8:30 AM
జైలులో 33వ రోజు చంద్రబాబు..
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 33వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబును జైల్లో ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్న అధికారులు
►కోర్టు నిబంధనల ప్రకారం స్పెషల్ ఎమినిటీస్‌ను చంద్రబాబుకు కల్పించిన  అధికారులు
►ప్రతిరోజు రెండుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు
►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని‌ స్పష్టం చేస్తున్న జైలు అధికారులు
►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత.


8:15 AM
విజయవాడ కోర్టుల్లో పలు కేసులు విచారణ
►స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ 
►నేడు విచారణకు రానున్న కేసు.
►అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ.
►లోకేశ్‌కు వచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగింపు
►ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ
►విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్‌కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్‌పై విచారణ
►నిన్న ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్
►ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం
►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం 
►ఇంటి దగ్గరే న్యాయవాది సమక్షంలో విచారించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిన్న ఆదేశాలు

8:00 AM
ఢిల్లీలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
►తమ పెద్దమ్మ, ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరితో కలిసి అమిత్‌షాతో నారా లోకేశ్ భేటీ
►భేటీలో పాల్గొన్న టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 
►చంద్రబాబుపై  కేసులు, అనంతర పరిణామాలు, జైల్లో చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు వివరించిన లోకేశ్.

7:00 AM
PT వారంటుపై నేడు విచారణ
► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా
► ఏసీబీ కోర్టులో నిన్న ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు
► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి
► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది
► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు
► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం
► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు
► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు
► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది
► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి.

రింగ్‌ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్‌ 17న విచారణ
► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్

మళ్లీ ఢిల్లీకి లోకేష్‌
► విజయవాడ నుంచి ఢిల్లీకి  నారా లోకేష్
► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ
► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్.

Advertisement

What’s your opinion

Advertisement