Weekly Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి

Published Sun, Mar 10 2024 6:55 AM

Weekly Horoscope In Telugu From 10-03-24 To 16-03-24 - Sakshi

మేషం
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

వృషభం
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. మనశ్శాంతి లోపిస్తుంది.  తెలుపు, కాఫీరంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మిథునం
విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.

సింహం
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.  పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. శత్రువులే మిత్రులుగా మారతారు. మీ సత్తా కొన్ని విషయాలలో నిరూపించుకుంటారు.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ, సాంకేతికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. గులాబీ, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

తుల
అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది.  ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం  ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం
పనులు సకాలంలో పూర్తి కాగలవు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు,భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మకరం
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  మధ్యలో ధనలబ్ధి. వాహనయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

కుంభం
కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఆసక్తికర సమాచారం.  కళాకారులకు నూతన అవకాశాలు. వారం మ«ధ్యలో అనారోగ్యం. నిర్ణయాలు వాయిదా. తెలుపు, లేత ఎరుపురంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. దూరప్రయాణాలు. నీలం, పసుపురంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 

Advertisement
Advertisement