వేలూరు జిల్లాలో గాలివాన | Sakshi
Sakshi News home page

వేలూరు జిల్లాలో గాలివాన

Published Wed, May 8 2024 8:50 AM

వేలూరు జిల్లాలో గాలివాన

వేలూరు: జిల్లాలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో పెద్దపెద్ద వృక్షాలు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు సైతం పడిపోవడంతో రాత్రంతా గ్రామస్తులు విద్యుత్‌ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద పెద్ద పిడుగులు పడిన శబ్దాలతో పాటు వర్షం కురుస్తుండంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. వేలూరు జిల్లాలోని అనకట్టు, పేర్నంబట్టు తాలుకాల్లో అధికంగా గాలులు వీయడంతో రాత్రి పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అలాగే గుడియాత్తం ప్రాంతంలో అధికంగా వర్షాలు కురవడంతో రోడ్డుపై వర్షపు నీరు నిలిచి పోవడంతో వాహనాలు రాకపోకలు స్తంభించి, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement