భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు

Published Wed, May 8 2024 8:50 AM

భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు

వేలూరు: తమిళ చిత్ర మాసంలో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలూరు,తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో ప్రదోషపూజలు చేశారు. ఈ సందర్భంగా నంది భగవాన్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, కర్పూర హారతులిచ్చారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, విశేషాలంకరణ చేశారు. అనంతరం శివాచార్యులు కర్పూర హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడిని బంగారు వృషభ వాహనంలో ఆలయ మూడో ప్రాకారం నుంచి మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్బంగా భక్తులు మాడ వీధుల్లో కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలోని నంది భగవాన్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.వాలాజలోని శ్రీ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, నంది భగవాన్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

 
Advertisement
 
Advertisement