Telangana: మరో రెండు రోజులు వానలు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో రెండు రోజులు వానలు

Published Wed, May 8 2024 4:56 AM

Two more days of rain

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక, దక్షిణ తమిళ నాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతోందని తెలిపింది. దీని ప్రభా వంతో వానలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

 ప్రధానంగా జయశంకర్‌ భూపాల పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబా బాద్, ములుగు, నల్లగొండ, సూర్యా పేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువన గిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎక్కువ ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.

సాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు
మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త దిగి వచ్చాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.7 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌లో 44.3 డిగ్రీలుగా నమోదైంది. ఇక వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement