ఉన్న పెన్షన్లు తీసేస్తారు | Sakshi
Sakshi News home page

ఉన్న పెన్షన్లు తీసేస్తారు

Published Wed, May 8 2024 3:00 AM

ఉన్న

చంద్రబాబు ఏవి చెప్పినా నమ్మడం సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్‌ రూ.4 వేలు అంటున్నాడు. దాని అమలు కోసం అనేక నిబంధనలు పెట్టి ఉన్న పెన్షన్లు ఎన్ని ఊడిస్తాడో తెలియదు. సీఎం జగన్‌ రూ.3 వేలు ఇస్తున్నా క్రమం తప్పకుండా ఠంచనుగా ఒకటో తేదీనే వలంటీర్‌ గడప తట్టి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో రూ.500 పెంచుతానని చెప్పాడు. జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది.

– మాలన్‌బీ, రాయదుర్గం పట్టణం

ఆ పాలన వద్దే వద్దు

టీడీపీకి పొరపాటున ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు కొని తెచ్చుకున్నట్టే. అప్పట్లో ఏ పథకం కావాలన్నా ఆ కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ సమయాన వారు ప్రవర్తించిన తీరు తలిస్తేనే భయమేస్తోంది. చంద్రబాబు మానస పుత్రికగా ఏర్పాటైన ఈ కమిటీలు పేదల రక్తాన్ని పీల్చాయి. ఆ పాలన కావాలని మళ్లీ కోరుకోవడం లేదు. – నాగరాజు యాదవ్‌, తాళ్లకెర,

గుమ్మఘట్ట మండలం

బాబుకు బుద్ధి చెప్పాలి

నాకు ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి రూ.3 వేలు పింఛను ఇచ్చేవాళ్లు. బాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించాడంట. దీంతో రెండు నెలలుగా నాకు పింఛను సరిగా అందలేదు. పేదలను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఆయన మాటలను నమ్మితే ప్రజలు మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.

– దురగమ్మ, పింఛనుదారు,

కంబదూరు

ఉన్న పెన్షన్లు తీసేస్తారు
1/2

ఉన్న పెన్షన్లు తీసేస్తారు

ఉన్న పెన్షన్లు తీసేస్తారు
2/2

ఉన్న పెన్షన్లు తీసేస్తారు

Advertisement
Advertisement