లాభాలు లేక చేతులెత్తేసిన అమెజాన్‌.. మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు! | Sakshi
Sakshi News home page

కంపెనీని నడపలేక చేతులెత్తేసిన అమెజాన్‌.. మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు!

Published Wed, Jan 10 2024 7:22 PM

Amazon Twitch To Layoff 500 Employees - Sakshi

ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ కొత్త ఏడాది 2024లో చేతులెత్తేసింది. ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ పేరెంట్‌ కంపెనీ  వీడియో లైవ్‌ స్ట్రీమ్‌ సర్వీసులు అందించే ‘ట్విచ్‌’ ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది. 

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం..అమెజాన్‌ ట్విచ్‌లో 35 శాతంతో 500 మంది ఉద్యోగల తొలగింపులపై నిర్ణయం తీసుకుంది. వీడియో లైవ్‌ స్ట్రీమ్‌ సేవలు మరింత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ లేఆఫ్స్‌ సైతం ట్విచ్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరిగా సంస్థను వదిలి వెళ్లిన తర్వాత తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది.

 

ఒక్కొక్కరిగా 
గత ఏడాదిలో ట్విచ్‌లో టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు ఆ సంస్థకు గుడ్‌బై చెప్పారు. వారిలో ట్విచ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌, చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌, చీఫ్‌ కంటెంట్‌ ఆఫీసర్‌తో పాటు గతంలో అమెజాన్‌ యాడ్స్‌ యూనిట్‌లో పనిచేసిన చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ సైతం ట్విచ్‌కు రాజీనామా చేశారు. తాజాగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 

కారణం అదే 
డిసెంబర్‌లో ట్విచ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ క్లాన్సీ దక్షిణ కొరియాలో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తుందని, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్టుబడులు ఎక్కువ పెట్టడం.. తిరిగి రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగుల్ని తొలగించింది.ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ‘‘ట్విచ్ నెలకు 1.8 బిలియన్ గంటల ప్రత్యక్ష వీడియో కంటెంట్‌కు సపోర్ట్‌ చేసేలా భారీ స్థాయిలో వెబ్‌సైట్‌లను నిర్వహించడం చాలా ఖరీదైనవని అన్నారు. 


 తొమ్మిదేళ్ల తర్వాత 
అమెజాన్‌ 2014లో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులు అందించే ట్విచ్‌ను 970 మిలియన్‌ డాలర్లను వెచ్చించి ఆ సంస్థను కొనుగులో చేసింది. ఈ కొనుగోలు జరిగిన తొమ్మిదేళ్లకు ట్విచ్‌తో పాటు లాభదాయకంగా లేదని ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ జారీ చేసిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఏమాత్రం లాభం లేని ట్విచ్‌లో నష్టాల్ని తగ్గించుకునేందుకు అమెజాన్‌ గత ఏడాది రెండు సార్లు 400 మందిని తొలగించింది. తాజాగా మరో 500 మందిని ఇంటికి పంపింది.

అమెజాన్‌లో 27 వేల మంది ఉద్యోగులు  
ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 27వేల మందికి ఫైర్‌ చేసిన విషయం తెలిసిందే.   

Advertisement
Advertisement