ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్‌, 3 లక్షల బీమా | Sakshi
Sakshi News home page

ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్‌, 3 లక్షల బీమా

Published Tue, Nov 1 2022 3:17 PM

Federal Bank credit card holders to get up to Rs 3 lakh life insurance cover - Sakshi

సాక్షి,ముంబై:  ఫెడరల్ బ్యాంక్  తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్ల కోసంఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో కలిసి సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 'గ్రూప్ క్రెడిట్ షీల్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా  పలు సౌలభ్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి రూ.3 లక్షల జీవిత బీమా  ఆఫర్‌ చేస్తోంది.  ప్రమాదవశాత్తూ కార్డు దారుడు మరణిస్తే నామినీకి రూ. 3 లక్షలు బీమా లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై  రూ.3 లక్షల వరకు క్రెడిట్ అందించడం మరో విశేషం. అయితే ఈ సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే.

ఈ మేరకు ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ప్రత్యేకమైన కవర్‌ను అందిస్తుంది. ఈ కార్డ్ క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 3 లక్షలు.   ప్రస్తుతం Celesta, Imperio, Signet అనే  మూడు వేరియంట్‌లను అందిస్తోంది.  ఈ కార్డులపై కస్టమర్లకు జీవిత భద్రత కల్పిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. తమ  క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు కేవలం 3 నిమిషాల్లో  దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చని, బైట్ సైజ్, బండిల్డ్ ప్రొడక్ట్‌ల ద్వారా దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని భావిస్తున్నామని బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలిని వారియర్ అన్నారు.

ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌ల కోసం తమగ్రూప్ క్రెడిట్ షీల్డ్‌ నిమిత్తం ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చాలా సంతోషదాయకమని ఏజిస్‌ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్  చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్-ప్రొడక్ట్స్ కార్తిక్ రామన్ తెలిపారు.  గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కస్టమర్‌లకు జీవిత బీమా  కల్పించి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే భారం లేకుండా వారిని కాపాడుతుందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement