దాతృత్వంలో శివ్‌ నాడార్‌ టాప్‌ | Sakshi
Sakshi News home page

దాతృత్వంలో శివ్‌ నాడార్‌ టాప్‌

Published Fri, Nov 3 2023 4:07 AM

Hurun Philanthropy List 2023: HCLTech Shiv Nadar is India most generous - Sakshi

ముంబై: విరాళాలివ్వడంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ శివ్‌ నాడార్‌ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. 2023లో ఏకంగా రూ. 2,042 కోట్లు విరాళమిచ్చి ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా 2023 జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. గతేడాది ఇచి్చన రూ. 1,161 కోట్లతో పోలిస్తే ఇది 76 శాతం అధికం. విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ రూ. 1,774 కోట్లతో (గతేడాదితో పోలిస్తే 267 శాతం అధికం) రెండో స్థానంలోనూ, రూ. 376 కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ విరాళాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ చీఫ్‌ కుమార మంగళం బిర్లా రూ. 287 కోట్లతో నాలుగో స్థానంలో, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ రూ. 285 కోట్లతో (50 శాతం అధికం) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నారు. ఇటీవలి హురున్‌ కుబేరుల జాబితా ప్రకారం అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగాను, అదానీది రూ. 4.74 లక్షల కోట్లు, నాడార్‌ సంపద రూ. 2.28 లక్షల కోట్లుగాను ఉంది. సంపద పెరిగే కొద్దీ సంపన్న కుటుంబాలు .. అట్టడుగు వర్గాల వారి కోసం ఆహారం, దుస్తులు, ఉపకార వేతనాలు మొదలైన దాతృత్వ కార్యకలాపాలకు విరాళాలిచ్చే ధోరణి పెరుగుతోందని హురున్‌ ఇండియా చీఫ్‌ రీసెర్చర్‌ అనాస్‌ రెహా్మన్‌ జునైద్‌ తెలిపారు. లిస్టులో మొత్తం 119 మంది వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి.  

మరిన్ని వివరాలు..
► బజాజ్‌ కుటుంబంతో పాటు సైరస్‌ ఎస్‌ పూనావాలా, అదార్‌ పూనావాలా, రోహిణి నీలెకని వంటి వారు టాప్‌ 10లో నిల్చారు. మహిళల్లో నీలెకనితో పాటు అను ఆగా (థర్మాక్స్‌), లీనా గాంధీ తివారీ (యూఎస్‌వీ) కూడా ఉన్నారు.  
► డిస్కౌంటు బ్రోకరేజీ జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ ఈ జాబితాలో అత్యంత పిన్న వయసు్కడు. కామత్‌ సోదరులు రూ. 110 కోట్లు విరాళమిచ్చారు.
► రూ. 150 కోట్ల విరాళంతో ఎల్‌అండ్‌టీ గౌరవ చైర్మన్‌ ఏఎం నాయక్‌ .. ప్రొఫెషనల్స్‌ జాబితాలో అగ్రస్థానంలో, ఓవరాల్‌ లిస్టులో 11వ స్థానంలో ఉన్నారు.  

Advertisement
Advertisement