ఆస్ప‌త్రిలో హీరోయిన్‌.. మ‌త్తు మందు.. బాధ‌ త‌ట్టుకోలేక‌పోతున్నా! | Daksha Nagarkar Hospitalised And Undergoes For Surgery, Shared Interesting Post Goes Viral | Sakshi
Sakshi News home page

Daksha Nagarkar Health Update: ఆస్ప‌త్రిలో టాలీవుడ్‌ హీరోయిన్‌.. కోలుకోవ‌డం క‌ష్టంగా ఉందంటూ పోస్ట్‌

May 6 2024 1:26 PM | Updated on May 6 2024 1:54 PM

Daksha Nagarkar Hospitalised and Undergoes for Surgery

ప్రేమ‌, కేరింగ్‌కు క‌నిపించ‌ని గాయాల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది. నా ఈ పరిస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు.

ద‌క్ష న‌గార్క‌ర్.. సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి తొమ్మిది సంవ‌త్స‌రాల‌పైనే అవుతోంది. ఇన్నేళ్ల‌లో ఐదు సినిమాలు మాత్ర‌మే చేసింది. అవ‌న్నీ తెలుగు చిత్రాలు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కాలంగా టాలీవుడ్‌నే అంటిపెట్టుకుని ఉన్నా భారీ స్థాయిలో ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. హుషారు, జాంబి రెడ్డి, రావ‌ణాసుర చిత్రాల‌తో అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ బంగార్రాజు సినిమాలో ఓ పాట‌లో అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయింది.

స‌ర్జ‌రీ గ‌దిలో
అయితే త‌ర‌చూ ఏదో ఒక ఈవెంట్‌లో మెరుస్తున్న బ్యూటీ.. తాజాగా ఆస్ప‌త్రిపాలైన‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'గ‌డిచిన‌ కొద్ది రోజులు నాకెంతో క్లిష్టమైన‌వి.. ఎవరో తెలియ‌ని వ్య‌క్తుల మ‌ధ్య స‌ర్జ‌రీ గ‌దిలో ప‌డి ఉండ‌టం క‌ష్టంగా ఉంది. ఇప్ప‌టికే వెన్నెముక‌కు రెండుసార్లు మ‌త్తు మందు(అన‌స్థీషియా) సూదులు గుచ్చారు.

ప్రేమ‌, కేరింగ్‌
దాన్నుంచి కోలుకోవ‌డం క‌ష్టంగా ఉంది. నా ఎమోష‌న్స్‌ను అదుపులో పెట్టుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నించాను. న‌న్ను ప్రేమించే వ్య‌క్తులు నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఇలాంటి స‌మ‌యంలో ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ‌, కేరింగ్‌కు క‌నిపించ‌ని గాయాల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది. నా ఈ పరిస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు. 

మీరు బాధ‌ప‌డ‌కూడ‌దు 
మీ ఆరోగ్యంపై మీరు శ్ర‌ద్ధ వ‌హించండి. నా గురించి సంతోష‌క‌ర‌మైన విష‌యాల‌నే పోస్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే మీరు బాధ‌ప‌డ‌కూడ‌దు కాబ‌ట్టి!' అని రాసుకొచ్చింది. త‌న‌కు ఏ స‌ర్జ‌రీ అయింద‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. ఇది చూసిన జ‌నాలు.. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement