LIC acquires 7% shareholding in Jio Financial Services - Sakshi
Sakshi News home page

అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్‌ఐసీ భారీ వాటా కొనుగోలు

Published Tue, Aug 22 2023 10:58 AM

LIC acquires 7pc shareholding in Jio Financial Services - Sakshi

LICacquires6.66pcJFS: లయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్‌ అయిన ఫైనాన్షియల్ ఎంటిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థలో 6.66 శాతం వాటా  కొనుగోలు చేసింది. ఈ మేరకు ఎల్‌ఐసీ మంగళవారం ప్రకటించింది.

ఇదీ చదవండి:ఎస్‌బీఐ లైఫ్‌: కస‍్టమర్లకు గుడ్‌ న్యూస్‌

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు సోమవారం లిస్టింగ్ తర్వాత దాని తొలి ట్రేడింగ్ సెషన్‌లో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ షేరు ఒక్కో షేరుకు రూ. 265గా లిస్ట్‌ అయింది. చివరికి 5 శాతం నష్టంతో ముగిసిన సంగతి తెలిసిందే. కంపెనీ విభజన తేదీ అయిన జూలై 20న దాని ఉత్పన్నమైన ధర రూ. 261.85 కంటే 1 శాతానికి పైగా మార్జినల్ ప్రీమియం. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.68 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు  తగ్గింది. మరోవైపు వరుసగా రెండో సెషన్‌లో మంగళవారం కూడా జేఎఫ్‌ఎస్‌ షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Advertisement
Advertisement