Sakshi News home page

మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్.. వెనుకపడ్డ యాపిల్

Published Fri, Jan 12 2024 9:15 AM

Microsoft Is Worlds Most Valuable Company - Sakshi

యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మరో సారి రికార్డ్ క్రియేట్ చేసింది. 2024 ప్రారంభం నుంచి మార్కెట్లో యాపిల్ డిమాండ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ యాపిల్‌ని బీట్ చేసి ఆ స్థానం కైవసం చేసుకుంది.

వాషింగ్టన్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5% పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏఐ మైక్రోసాఫ్ట్ వృద్ధికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2021 తర్వాత మొదటి సారి యాపిల్ వాల్యుమేషన్ మైక్రోసాఫ్ట్ కంటే తక్కువకు పడిపోయింది.

కరోనా మహమ్మారి సమయంలో సప్లై చైన్ కొంత నిరాశపరచిన సమయంలో కూడా యాపిల్‌ని మైక్రోసాఫ్ట్‌ అధిగమించింది. ప్రస్తుతం, వాల్ స్ట్రీట్ మైక్రోసాఫ్ట్‌ మరింత సానుకూలంగా ఉంది. ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న కారణంగా యాపిల్ బలహీనపడింది.

ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. 

చైనాలో యాపిల్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది, రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ వృద్ధి గతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐతో టై ఆప్ కావడమని తెలుస్తోంది.

Advertisement
Advertisement