Mukesh Ambani eyes Rs 25k to 40k crore in new move proposal with SEBI - Sakshi
Sakshi News home page

అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపైకన్ను

Published Tue, Aug 22 2023 11:41 AM

Mukesh Ambani eyes Rs 25 to 40k crore in new move proposal with SEBI - Sakshi

ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ మరో భారీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆయిల్‌ నుంచి టెలికాం దాకా పట్టిందల్లా బంగారంలా దూసుకు పోతున్న అంబానీ తాజాగా వేల కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రపోజల్‌ను మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ ముందు ఉంచినట్టు సమాచారం. 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT) ద్వారా ప్రాథమికంగా రూ.400 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనను సెబీ వద్ద దాఖలు చేసినట్లు ఇండియా రిటైలింగ్ రిపోర్ట్‌ చేసింది. రిలయన్స్ రిటైల్ ఇన్విట్‌ రానున్న రెండు నెలల్లో ప్రారంభంలో సుమారు రూ.400 కోట్లను సమీకరించనుంది. మొదటి రౌండ్ నిధులతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అయితే  ఈ ఏడాది క్యూ4 నాటికి మొత్తంగా రూ.25,000-40,000 కోట్ల దాకా నిధులను సేకరించాలనేది ప్రణాళిక. అయితే ఈ వార్తలపై  రిలయన్స్‌ అధికారంగా స్పందించాల్సి ఉంది.  (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్‌ఐసీ భారీ వాటా కొనుగోలు)

2.4-3 బిలియన్ డాలర్ల ట్రస్ట్‌తో రిటైల్ వేర్‌హౌసింగ్ ఆస్తులను మోనటైజ్ చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు గత ఏప్రిల్ నుంచే హల్‌చల్‌చేస్తున్న సంగతి తెలిసిందే.  రిలయన్స్ రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో ఆఫ్‌లైన్ సెగ్మెంట్‌లో భారీగా విస్తరిస్తోంది.ఈ క్రమంలో  రిలయన్స్ రిటైల్ ఇతర కీలకమైన అంబానీ సంస్థలను అధిగమించి 112 బిలియన్ డాలర్ల విలువగా బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ ఇటీవల నివేదించడం గమనార్హం. దీంతో  ఈ వార్తలు మరింత బలం చేకూరుతోంది.

కాగా 2022 ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ పగ్గాలను ఇషా అంబానీ చేపట్టారు. ఆమెనేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడి రూ. 25,000 కోట్లకు పైమాటే.దీనికి అదనంగా రూ. 15000 కోట్లుపెట్టుబడులను రిలయన్స్‌  అందించనుంది. 

Advertisement
Advertisement