’జీ’ సుభాష్‌ చంద్రపై దివాలా చర్యలకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు | Sakshi
Sakshi News home page

’జీ’ సుభాష్‌ చంద్రపై దివాలా చర్యలకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు

Published Fri, Apr 26 2024 5:50 AM

NCLT admits personal insolvency plea against Zee

న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (జీల్‌) గౌరవ చైర్మన్‌ సుభాష్‌ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్‌ చేపట్టాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశించింది. ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థ వివేక్‌ ఇన్‌ఫ్రాకాన్‌ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) దాఖలు చేసిన పిటీషన్‌ మీద ఎన్‌సీఎల్‌టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్‌ బ్యాంక్‌) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. 
 

ఓపెన్‌ కోర్టులో ఎన్‌సీఎల్‌టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్‌ చేస్తున్న ఎస్సెల్‌ గ్రూప్‌లో భాగమైన వివేక్‌ ఇన్‌ఫ్రాకాన్‌ సంస్థ 2022లో  ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్‌ అయ్యింది. దీనిపైనే ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ .. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. 
 

వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్‌ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement