బీ అలర్ట్‌ - అమెజాన్ పేరుతో కొత్త మోసం.. | Sakshi
Sakshi News home page

బీ అలర్ట్‌ - అమెజాన్ పేరుతో కొత్త మోసం..

Published Tue, Jan 2 2024 9:46 PM

New Type of Fraud Name of Amazon - Sakshi

టెక్నాలజీ పెరుతున్న తరుణంలో కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది సైబర్ ఫ్రాడ్. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువైపోయాయి. తాజాగా అమెజాన్ పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెజాన్ కంపెనీ పేరిట దుండగులు కొత్త మోసాలకు తెరలేపారు. ఇంస్టాగ్రామ్‌లో బట్టలు విక్రయిస్తున్నట్లు ఒక వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి.. దానిని చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. దీనికి అట్రాక్ట్ అయిన చాలామంది జనం ఆ వెబ్‌సైట్‌ మీద క్లిక్ చేసి అక్కడున్న ఉత్పత్తులను ఆర్డర్ చేసుకుంటున్నారు.

ఈ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులు వెయ్యి రూపాయలకు నాలుగు డ్రెస్సులు అని ప్రకటించడం వల్ల ఎక్కువ మంది దీనికి ఆకర్షితులయ్యారు. రూ.1000లకే నాలుగు డ్రెస్సులు లభిస్తాయనే ఆశతో ఆర్డర్ చేసి నగదు కూడా పే చేస్తున్నారు. దుండగులు డెలివరీలను కూడా అమెజాన్ మాదిరిగా ఉండే కవర్‌తోనే డెలివరీ చేసి మోసం చేస్తున్నారు. చివరికి జరిగిన మోసాన్ని గ్రహించి బాధితులు వాపోతున్నారు.

Advertisement
Advertisement