ఆ చట్టంపై బాబు దొంగ నాటకం | Sajjala Ramakrishna Rreddy Sensational Comments on Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ చట్టంపై బాబు దొంగ నాటకం

Published Mon, May 6 2024 4:12 AM | Last Updated on Mon, May 6 2024 4:14 AM

Sajjala Ramakrishna Rreddy Sensational Comments on Chandrababu

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అసెంబ్లీలో ఆ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చిందని స్పష్టీకరణ

ఆనాడు టీడీపీ సభ్యుడు పయ్యావుల ప్రసంగం వీడియో ప్రదర్శన

ఇప్పుడు ఆ చట్టం పైనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు

చంద్రబాబు నగ్న స్వరూపాన్ని ప్రజలందరూ గమనించాలని వినతి

దీనిపై ప్రజాకోర్టులో బాబు సంజాయిషీ ఇచ్చుకోవాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న దొంగ నాట­కాన్ని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశా­రు. అసెంబ్లీలో 2019 జూలై 29న ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ చేసిన ప్రసంగం వీడియోను ఆయన ఆదివారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని, ఎవరి భూములపై వారికి భద్రత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఇప్పటికే కర్ణాటక సర్కార్‌ భూమి పేరుతో అమలు చేస్తోందని పయ్యావుల కేశవ్‌ ఆనాడు అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు.

ఈ చట్టం 1858 నుంచి ఆస్డ్రేలియా దేశంలో అమ­లవుతోందని, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉందని కేశవ్‌ చెప్పారన్నారు. ఆనాడు బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చి, ఆమో­దించిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్ర­బాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ, రద్దు చేస్తామని చెబుతూ ఆయన నగ్న స్వరూపాన్నీ ఆయనే బయ­ట­­­పెట్టుకున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని చెప్పారు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు, భద్రత కల్పిస్తూ సీఎం జగన్‌ ఆదర్శ­ప్రాయమైన నిర్ణయం తీసుకుంటే అడ్డగోలుగా ఆరో­పణలు చేస్తారా అంటూ మండిపడ్డారు.

దీని­పై ప్రజాకోర్టు బోనులో నిలబడి చంద్ర­బాబు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాబు స్వార్ధ ప్రయోజనాల కోసం 5 కోట్ల మంది ప్రజ­లను భయభ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఇంతకంటే నీచులు.. రాజ­కీయ వ్యభి­చా­రులు ఎవరైనా ఉంటారా అంటూ తూర్పా­ర­బట్టారు. సీఎం జగన్‌ను ఎత్తి చూపే­ందుకు ఏ అస్త్రాలూ లేకపోవడంతో ఎలాగైనా అధి­కా­రంలోకి రావాలనే కుట్రతో చంద్రబాబు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని అన్నారు.

రాష్ట్రా­నికి పట్టిన చీడ చంద్రబాబేనని, దీనిని ఆయనే మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షు­రాలు పురందేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మాట్లాడుతు­న్నారని ధ్వజ­మెత్తారు. దేశమంతా బీజేపీ ఒకలా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ రాష్ట్ర విభాగం పనిచేస్తోందని అన్నారు. పురందేశ్వరి రెండు నాల్క­ల ధోరణితో వ్యవహరి­స్తున్నారని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement