Land Titling Act
-
రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ
రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఎన్నికల ముందు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం నుంచి బయట పడటానికి చట్టాన్ని రద్దు చేశారు. ల్యాండ్ రిఫారŠమ్స్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ఎన్నికల ముందు చేసింది దుష్ప్రచారంఅని చెప్పడానికి ఇంతకంటే రుజువుఏం కావాలి? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘భూముల రీసర్వే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు.. ఇదొక గొప్ప సంస్కరణ. ఈ చట్టం ద్వారా భూములు కొనుగోలు చేసే వాళ్లకే కాదు.. అమ్మే వాళ్లకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. ఇన్సూ్యరెన్స్ కూడా కల్పిస్తుంది. టైటిల్స్‌ను వెరిఫై చేసి భూ యజమానుల సమక్షంలోనే సరిహద్దు రాళ్లు పాతి.. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం. ఇలాంటి చట్టంపై ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు దారుణంగా తప్పుడు ప్రచారం చేశారు. దాన్నుంచి బయట పడేందుకు ఇప్పుడు పాట్లు పడుతున్నారు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్వేతపత్రం పేరిట ఈ చట్టంపై చంద్రబాబు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఫ్యాక్ట్ పేపర్ పేరిట వైఎస్ జగన్ శుక్రవారం తిప్పికొట్టారు. ‘రీ సర్వే కోసం సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఈ ప్రాజెక్టు కోసం నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఒరిజినల్ డాక్యుమెంట్లే పొందారు. ఇలా రిజిస్ట్రేషన్ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. అయినా సరే పనిగట్టుకొని ఈ చట్టంపై ఎన్నికల్లో దుర్మార్గంగా ప్రచారం చేశారు. లేని పోని అపోహలు, భయాందోళనలకు గురిచేశారు. పదేపదే చెప్పిన అబద్ధాలు.. దుష్ప్రచారం నుంచి బయట పడేందుకు అసెంబ్లీలో ఆ చట్టాన్ని రద్దు చేశారు. తీరా ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్‌ను ముందుకు తీసుకెళ్లే రాష్ట్రాలకు ఇన్సెంటివ్‌గా 50 ఏళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో రీ సర్వేపై మళ్లీ యూ టర్న్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రికార్డులన్నీ అప్గ్రేడ్అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా ల్యాండ్ టైటిల్ వివాదాలు విన్పించవు. క్రయవిక్రయాల సందర్భంగా ఎక్కడా భూ వివాదాలు తలెత్తవు. కారణం అక్కడ టైటిల్స్ పక్కాగా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఈరోజు భూములు కొనుక్కోవాలంటే భయపడే పరి స్థితి. రేప్పొద్దున మీ భూమికి ఓనర్ తామే అంటూ ఎవరో ఒకరు వస్తారని కొనే వాళ్లకు భయం. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్టును తీసుకొచ్చాం. ఈ యాక్టు ద్వారా కొనే వారికి, అమ్మే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. బీమా ఇస్తుంది. ఇందు కోసం 15వేల మంది సర్వేయర్లను నియామకంతో పాటు రోవర్స్, సరిహద్దు రాళ్లు పెట్టాం. రికార్డులన్నీ అప్‌గ్రేడ్ చేశాం. మ్యూటేషన్ పూర్తి చేశాం. సబ్ డివిజన్ చేశాం. ప్రతి రికార్డును సచివాలయంలోనే అందుబాటులో ఉంచాం. టెటిల్స్ వెరిఫై చేసి మీ సమక్షంలోనే సరిహద్దు రాళ్లు పాతి గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశాం. ఒక్క ఫిర్యాదు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలుంటే వాటిలో 8 వేల గ్రామాలలో రీ సర్వే పూర్తి చేశాం. ఇప్పటికే 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇచ్చాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచే కాకుండా, రీ సర్వే పూర్తయిన గ్రామాల నుంచి కూడా ఏ ఒక్కరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాంటి ఈ యాక్టుపై ప్రజల్లో అపోహలు సృష్టించి చేసి ఓ మంచి కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. ఆ దుష్ప్రచారం నుంచి బయటపడలేక అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. అసైన్డ్, షరతులు, చుక్కల భూముల విషయంలో దశాబ్దాలుగా ఇబ్బందులు పడిన రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. 97 వేల మందికి.. 2,06,171 ఎకరాల చుక్కల భూములపై హక్కులు కల్పించింది. 35 వేల ఎకరాల షరతులు కలిగిన భూములను 22ఏ నుంచి తొలగించి 22వేల మంది రైతులకు మేలు చేస్తే అవినీతి అన్నారు. 20 ఏళ్లు పూర్తయిన 27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై 15,21,160 మంది దళితులు, పేద రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తే అవినీతి, అన్యాయమంటూ దుష్ప్రచారం చేశారు. మా ప్రభుత్వంలో 42,397 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేశాం. 1.54 లక్షల మంది గిరిజనులకు 3.26 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం. విలేజ్ సర్వీస్ ఇనాం ల్యాండ్స్ కింద 1.58 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించి, 1.61లక్షల మంది రైతులకు మంచి చేశాం. చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లక్షల మందికి మంచి చేస్తే ప్రశంసించాల్సింది పోయి దాన్ని తమకు అనుకూలంగా వక్రభాష్యం చెప్పగలిగినó నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. భూముల విషయంలో ఆయన ఆలోచన విధానం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేయనీయకుండా అడ్డుకుంటున్నాడో ఆలోచించాలి. బహుశా.. ఈ భూములపై హక్కులను తమ వాళ్ల పేరిట మార్చుకొనేందుకు అవకాశం కల్పించేందుకే చంద్రబాబు అడ్డుకుంటున్నాడా.. అని ప్రజలు ఆలోచించాలి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాగే కొనసాగించి, తన మనుషులతో తక్కువ రేటుకు కాజేయాలని అడ్డుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పేదలకు వాళ్ల భూములు వాళ్లు అమ్ముకునే స్వేచ్చ ఉండకూడదు. అప్పుడే తక్కువ రేటుకు కాజేయొచ్చన్న ఆలోచన చంద్రబాబుది. -
అస్తవ్యస్త విధానమే ప్రియం!
భూమి అమ్మే వారికి, కొనే వారికి ఒక భరోసా కల్పించేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. పక్కాగా సర్వే చేసి.. స్పష్టంగా హద్దులు చూపిస్తూ క్లియర్ టైటిల్‌తో ఆ భూమికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం ఆహా్వనించదగిన పరిణామం. భూమికి ఏ ఇబ్బందీ రాకుండా ఇన్సూ్యరెన్స్ చేసినట్లుగా భావించవచ్చు. ఇదివరకు ఎక్కడా దేశంలో భూములకు ఇలాంటి భరోసా లేదు. రాష్ట్రంలో అది సాకారం కావడానికి వేలాది మంది సర్వేయర్లను నియమించి, అధునాతన సాంకేతికను ఉపయోగించి సర్వేకు శ్రీకారం చుట్టింది. ‘వైఎస్ జగన్‌కు ముందు.. ఆ తర్వాత..’ అని స్పష్టంగా జరిగిన మేలును కళ్లకు కట్టేలా, ప్రభుత్వం ఇస్తున్న క్లియర్ టైటిల్‌కు గుర్తుగా కొత్తగా సర్వే చేసి ఫొటోతో ఇవ్వడంపై ఎల్లో గ్యాంగ్ రాద్ధాంతం చేయడం దుర్మార్గం. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసమేనని స్పష్టమవుతోంది.సాక్షి, అమరావతి: దేశమంతా అమలు కావాలని కోరుకుంటున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు రాజకీయ క్రీడకు బలైపోయింది. 90 దేశాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఉపయోగించుకుని కూటమి పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందాయి. భూములు పోతాయనే దారుణమైన ప్రచారంతో ప్రజలను భయకంపితుల్ని చేశారు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు తాము మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చంద్రబాబు, కూటమి పార్టీలు భయంకరమైన కుట్రలు చేశాయి. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించారు. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరని పచ్చి అబద్ధాన్ని విస్తతంగా ప్రచారం చేసి ప్రజలను వంచించారు. నిజానికి సంవత్సరం నుంచి 9.58 లక్షల స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాయి. వాటన్నింటికీ సంబంధింత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు. 15.91 లక్షల ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలానే ఇచ్చారు. ఈ–స్టాంపింగ్పైనా ఎడతెగని దు్రష్పచారం చేసి జిరాక్స్ కాపీలు ఇస్తారని, ఆస్తి యజమానుల వారసులను అధికారులే నిర్ణయిస్తారని దారుణంగా వక్రీకరించారు. అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వ నిర్ధారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తప్పుగా చిత్రీకరించారు. సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనప్పటికీ నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ అన్యాయంగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజల్లో ఒక రకమైన భయానకం సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలు చేశారు. అసెంబ్లీలో మద్దతిచ్చి ఎన్నికల్లో వ్యతిరేకించిన టీడీపీ ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్‌గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారు చేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని తయారు చేసింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటి పీఏసీ ఛైర్మన్, ప్రస్తుత ఆరి్థక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని అసెంబ్లీలో స్వాగతించారు. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్టుమెంట్æ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా, ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి శాఖలన్నీ 3 సంవత్సరాలు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకూ వ్యతిరేకంగా ఈ చట్టం లేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై టీడీపీ, కూటమి పార్టీలు, ఎల్లో మీడియా దారుణంగా దుష్ప్రచారం చేసి ప్రజలను భయకంపితుల్ని చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ విషయం ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న చట్టాన్ని, దేశం మొత్తం రావాలంటున్న చట్టాన్ని కేవలం రాజకీయం కోసం చంద్రబాబు బలి చేశారు. అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. దుష్ప్రచార హోరులో వాస్తవాలు కనుమరుగు నిజానికి ప్రజల ఆస్తులకు మరింత భద్రత కల్పించడానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని చేసుకోవాలని 2019లో నీతి అయోగ్ అనేకసార్లు చెప్పింది. అందుకు సంబంధించి ఒక ముసాయిదా చట్టాన్ని కూడా చేసింది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైట్లింగ్ మోడల్ చట్టం చేసింది. పైగా దీనికి టీడీపీ అసెంబ్లీలో మద్దతు తెలిపింది. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం దాన్ని అడ్డగోలుగా వ్యతిరేకించి రాజకీయం చేసింది. ప్రజలకు మేలు చేసే, రాష్ట్ర భూముల స్వరూపాన్ని, భూమి రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చేసే చట్టాన్ని రాజకీయ మంటల్లో కాల్చివేసి ప్రజలకు తీరని ద్రోహం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం వద్దనడం సరికాదు ల్యాండ్ టైటిల్ గ్యారంటీ చట్టం ద్వారా భూమి హక్కులకు ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. చట్టంలో కొన్ని రకాల సమస్యలు ఉంటే ఉండవచ్చు. కానీ చట్టమే తప్పనడం, దాన్ని వద్దనుకోవడం సరికాదు. 1989 నుంచి ఇలాంటి చట్టం కావాలనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 2004లో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికి 3 ముసాయిదా చట్టాలు కూడా తయారు చేసింది. కానీ చట్టరూపం దాల్చలేదు. అయితే అందుకనుగుణంగా మొదటిసారి చట్టం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో బిల్లు పెట్టారు. రాజస్థాన్ ప్రయత్నం చేసింది. ఢిల్లీ కూడా అనుకుంది. కానీ ఎక్కడా చట్టం రాలేదు. ఈ చట్టం వస్తే భూమి రికార్డుల్లో స్పష్టత వస్తుంది. ఒకసారి రికార్డులో పేరు ఎక్కితే రైతుకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుంది. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి భూ విధానం ఉందో మనకు అలాగే ఉంటుంది. ప్రపంచం అంతా కోరుకుంటున్న మార్పు అది. దీనివల్ల భూ యజమానికి భద్రత పెరగడమే కాకుండా, భూమి విలువలు కూడా పెరుగుతాయి. ఆ భూములపై లావాదేవీలు సులువవుతాయి. హక్కులు పోతాయి, భూములు బలవంతంగా లాక్కుంటారు, ఆక్రమిస్తారనే అంటున్నారు. కానీ ఈ చట్టం ఉద్దేశం అది కాదు. అది జరగదు కూడా. ఈ చట్టం గురించి దేశంలో 40 ఏళ్లుగా రకరకాల కమిటీలు, నిపుణులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అన్నీ అయిన తర్వాతే ఈ విధానాన్ని తీసుకువచ్చారు. – సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
ఇవిగో ఒరిజినల్ డాక్యూమెంట్లు..ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై పబ్లిక్ రియాక్షన్
-
రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్‌లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..సీఎం జగన్ ప్రయత్నం కూడా ఇదే..
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు గ్యాంగ్ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది. అసలు ఈ చట్టంపై కూటమి నేతల ఆరోపణలు.., వాస్తవాలేమిటో తెలుసుకుందాం..కూటమి నేతల ఆరోపణలు–వాస్తవాలుఆరోపణ: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.వాస్తవం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం. ప్రభుత్వమే గ్యారెంటీ సర్టిఫికెట్ ఇవ్వడం. భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం. భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు.ఆరోపణ: భూ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి.వాస్తవం : భూ పత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి, ప్రజలకు గ్యారెంటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు.ఆరోపణ: కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి.వాస్తవం : మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారెంటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు.ఆరోపణ: కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పిలేట్ అథారటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్‌ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్లీ కోర్టుకే ఉంటుంది.ఆరోపణ: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌ఓకు సమాచారమివ్వాలి.వాస్తవం : సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధింత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికీ పోకుండా ఉంటుంది.ఆరోపణ: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు?వాస్తవం : ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు.ఆరోపణ: వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి.వాస్తవం : వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు.ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు. ఏపీలోనే ఉంది.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది.ఆరోపణ: ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే. కేంద్రానిది కాదు.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారెంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్‌లోపు అమలు చేయాలని ఆదేశించింది.ఆరోపణ: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది.వాస్తవం : ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రూపొందించలేదు.ఆరోపణ: ఈ చట్టం వల్ల రైతులకు నష్టం.వాస్తవం : ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి.ఆరోపణ : ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయి.వాస్తవం : ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు.ఆరోపణ : వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు?వాస్తవం : భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారెంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.ఆరోపణ : స్టాంపు కాగితాలకు బదులు జిరాక్సులు ఇస్తున్నారు.వాస్తవం : గత వంద సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ సర్టిఫికెట్ స్టాంపు కాగితాలకంటే విలువైనది. వీటిని జిరాక్స్ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారెంటీ సర్టిఫికెట్ పోగొట్టుకున్నా, టైట్లింగ్ ఆఫీసర్ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్లీ సర్టిఫికెట్ పొందవచ్చు.ఆరోపణ: న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది.వాస్తవం : ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక న్యాయవాదులకు సివిల్ కేసులు కూడా వస్తాయి.ఆరోపణ : పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి మీది కాదు.వాస్తవం : ఇది దిక్కుమాలిన వాదన. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణ ఇది. కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారెంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వేక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. -
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
వదినమ్మ బంధువులే...!ఇవాళ వాళ్ల అబద్ధాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయంటే.. కొద్ది వారాల క్రితం ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్‌లో విశాఖకు ఏకంగా రూ.2లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ తెచ్చారని, అదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనే అంటూ ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరంటే... చంద్రబాబు వదినమ్మ బంధువులే. తమవారేనని ఎప్పుడైతే బయటకు వచ్చిందో... అప్పుడు అందరూ గప్‌చుప్! అది బయటకు వచ్చేదాకా రూ.రెండు లక్షల కోట్ల డ్రగ్స్ అంట... తెచ్చింది వైఎస్సార్సీపీ అంట... అని బురద చల్లేయడమే!– మచిలీపట్నం సభలో సీఎం జగన్ఈసీపై ఒత్తిడి తెచ్చి..వీళ్ల కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయంటే.. మనం బటన్లు నొక్కిన ఆన్ గోయింగ్ స్కీమ్స్‌ను కూడా ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. – బందరు సభలో సీఎం జగన్జగన్ అనే రైతు చల్లిన విత్తనాలు..జగన్ అనే రైతు.. రాష్ట్రం అనే పంటపొలంలో విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలు, మంచి భవిష్యత్తు అనే విత్తనాలను నాటాడు. ఇవాళ్టికి ఐదేళ్లు అయింది. ప్రతి గ్రామం, పట్టణం, సామాజికవర్గాల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. మరో 15 ఏళ్లలో అవి మహా వృక్షాలు అవుతాయి. పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఐబీ సిలబస్ చదువులతో స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్ నుంచి 25 శాతం కరిక్యులమ్‌తో డిగ్రీ పూర్తి చేసి ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందుకుంటారు. అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ అత్యుత్తమ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. వారి బతుకులు, పేద కుటుంబాల తలరాతలు మారతాయి. పేదరికం అన్నది మటుమాయం అయిపోతుంది. మీ బిడ్డ ప్రతి ఆలోచనా పేదవాడి బతుకులు ఎలా మార్చాలన్నదే.– రేపల్లె సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట/సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల కమిషన్ మీద తీవ్ర ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అమలవుతున్న పథకాలను (ఆన్ గోయింగ్) సైతం అడ్డుకుంటూ పేదలు, రైతులు, మహిళలు, అవ్వాతాతల పట్ల చంద్రబాబు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టి, కొనసాగుతున్న పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా కూడా అక్కచెల్లెమ్మల ఖాతాలకు డబ్బులు జమ కాకుండా కావాలనే ఆపుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందాల్సిన మంచికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్నది చాలా అవసరం. అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి. మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి’ అని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు, దత్తపుత్రుడు సంస్కారహీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి దుష్ప్రచారాలతో రాష్ట్రం పరువు ఏమవుతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కిరాణా షాపులు నడుపుకొంటున్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు గంజాయి విక్రయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పాలని సూచించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పైనా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదాలు పెరిగిపోయి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ టైటిల్ ఇన్సూరెన్స్‌తో సంస్కరణ తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నట్లు చెప్పారా? అని చంద్రబాబు, ఎల్లో మీడియాను నిలదీశారు. చంద్రబాబును నమ్మడం అంటే మరోసారి మోసపోవడం, కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని ప్రజలను హెచ్చరించారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యమన్నారు. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెలో, మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లలో, సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మూడు సభల్లో సీఎం ఏమన్నారంటే...పథకాల విప్లవం.. గడగడా చెబుతానాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీలు, 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు నుంచి ఏకంగా ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. పిల్లల చేతుల్లో తొలిసారిగా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ (ద్వి భాషా పాఠ్యపుస్తకాలు) కనిపిస్తున్నాయి. బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉన్నత చదువులు అభ్యసించే 93 శాతం మంది విద్యార్థులకు విద్యాదీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం. ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతిదీవెన అందిస్తున్నాం. విద్యారంగంలో ఇలాంటి విప్లవాలు గతంలో ఉన్నాయా?అక్కచెల్లెమ్మల సాధికారత..చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో మహిళా సాధికారతపై మీ బిడ్డ చిత్తశుద్ధితో వ్యవహరించాడని గర్వంగా చెబుతున్నా. నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు, 22లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని గతంలో ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేసిన పరిస్థితులు ఉన్నాయా? వారి కష్టాలను గుర్తించి ఇంటికే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, పథకాలు, రేషన్ డెలివరీ చేస్తున్నాం.రైతన్నకు అండగా...పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నలకు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పెట్టుబడి సాయంగా రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థ తెచ్చాం. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం∙లాంటివి తీసుకొచ్చాం. పేదలెవరూ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల దాకా ఉచిత వైద్యం అందిస్తూ భరోసా కల్పించాం. కోలుకునే సమయంలో జీవనభృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్, ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్షతో అండగా నిలిచిన ప్రభుత్వాలను గతంలో ఎప్పుడైనా చూశారా?అవ్వాతాతల పెన్షన్ అడ్డుకున్నదీ బాబేఅవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చిన పెన్షన్‌ను అడ్డుకున్నది ఎవరు? తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా సాక్షాత్తూ చంద్రబాబే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయించాడు. వలంటీర్లు ఇంటికి రాకూడదంటూ పెన్షన్‌ను అడ్డుకున్నాడు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను బ్యాంక్ అకౌంట్లలో వేయాలని ఎన్నికల కమిషన్‌తో ఉత్తర్వులు ఇప్పించాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్‌పై వేస్తున్నాడు.మన అభ్యర్థులను ఆశీర్వదించండిబాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈవూరి గణేష్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బందరు ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టు (కృష్ణమూర్తి),ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.మీ కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలు..గ్రామంలోనే 600 రకాల సేవలు అందిస్తున్న సచివాలయం, 60–70 ఇళ్లకు వలంటీర్ సేవలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, దిశ యాప్.. లాంటి మన కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలను ఇంతకు ముందెప్పుడైనా చూశారా? 14 ఏళ్లు అధికారంలో ఉండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికీ ఒక్క మంచి కూడా గుర్తురాదు. ఈ ఎన్నికల్లో పేదల శత్రువులంతా.. పేదలకు అండగా నిలబడిన ఒక్క మీ జగన్ మీద ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. మళ్లీ వలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, మన హాస్పిటళ్లు, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. మంచి చేసిన ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి.2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయా? ⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా.. ఒక్క రూపాయైనా ఎవరి ఖాతాలోనైనా జమ చేశాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌కి మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ మరోసారి వంచనకే ముగ్గురూ కొత్త మోసాలతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్లు అంటూ నమ్మబలుకుతున్నారు.గతంలో ఎప్పుడైనా జరిగాయా?వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లు ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. మీ జగన్‌కు ఓటేస్తే పథకాలు, ఇంటింటి అభివృద్ధి కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రముఖి మళ్లీ నిద్ర లేచి లకలక లకలకా..అంటూ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు మీ గడప తొక్కుతుంది. చంద్రబాబుకు ఏ రోజూ మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. సాధ్యం కాని హామీలతో బాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఆయన మోసాలను కళ్లకు కడుతుంది. మరోవైపు అక్కచెల్లెమ్మల బాగు కోసం మీ బిడ్డ 59 నెలల వ్యవధిలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా అందించి 130సార్లు బటన్లు నొక్కాడు. రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాడు. ఏ సచివాలయానికి వెళ్లినా నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు 1.31 లక్షల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా పోస్టులను భర్తీ చేశాం. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా?మన మచిలీపట్నం అభివృద్ధి...⇒ మన మచిలీపట్నంలో రూ.5,100 కోట్లతో పోర్టు నిర్మాణం వాయువేగంగా జరుగుతోంది. దీన్ని సాయంత్రం అలా వెళ్లినప్పుడు మీరే చూస్తున్నారు. ⇒ ఇదే మచిలీపట్నంలో రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది మీ బిడ్డ పాలనలోనే. ⇒ ఇదే బందరులో పక్కనే రూ.350 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌తో ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరంటే మీ బిడ్డ జగన్. ⇒ ఈ ప్రాంతంలో భూముల సమస్యను పరిష్కరించింది ఎవరు? ఎవరు ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయో ఆలోచించండి. అన్నింటికీ సొల్యూషన్ మీ జగన్. ⇒ నాని ఇప్పుడే చెబుతున్నాడు.. బందరు తీర ప్రాంతంలోని 14 గ్రామాల్లో 30–40 ఏళ్లుగా భూములను అనుభవిస్తున్న పేద రైతులకు భూ హక్కులు కల్పించే ఫైల్‌ను చంద్రబాబు ఆపారు. మళ్లీ మీ బిడ్డ గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే బందరుకు వచ్చి అవే భూములు మీ అందరికీ పంచిపెడతాడని హామీ ఇస్తున్నా. -
బాబే భూబకాసురుడు
-
దొంగలు దొరికారు
-
అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్
-
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
-
సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..
-
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న దొంగ నాటకాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశారు. అసెంబ్లీలో 2019 జూలై 29న ల్యాండ్ టైట్లింగ్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగం వీడియోను ఆయన ఆదివారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని, ఎవరి భూములపై వారికి భద్రత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఇప్పటికే కర్ణాటక సర్కార్ భూమి పేరుతో అమలు చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆనాడు అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు.ఈ చట్టం 1858 నుంచి ఆస్డ్రేలియా దేశంలో అమలవుతోందని, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉందని కేశవ్ చెప్పారన్నారు. ఆనాడు బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చి, ఆమోదించిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ, రద్దు చేస్తామని చెబుతూ ఆయన నగ్న స్వరూపాన్నీ ఆయనే బయటపెట్టుకున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని చెప్పారు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు, భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంటే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు.దీనిపై ప్రజాకోర్టు బోనులో నిలబడి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబు స్వార్ధ ప్రయోజనాల కోసం 5 కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఇంతకంటే నీచులు.. రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా అంటూ తూర్పారబట్టారు. సీఎం జగన్‌ను ఎత్తి చూపేందుకు ఏ అస్త్రాలూ లేకపోవడంతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కుట్రతో చంద్రబాబు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని అన్నారు.రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబేనని, దీనిని ఆయనే మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీ ఏజెంట్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశమంతా బీజేపీ ఒకలా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ రాష్ట్ర విభాగం పనిచేస్తోందని అన్నారు. పురందేశ్వరి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా దుష్ప్రచారానికి కుట్ర పన్నినట్లు నిర్ధారణ అయింది. భూములకు సంపూర్ణ భద్రత కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న కుతంత్రం వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని నిగ్గు తేలింది. టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించింది.ఈ అంశంపై తక్షణం తగిన చర్యలు తీసుకుని తమకు నివేదించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. సీఐడీ చేపట్టిన దర్యాప్తులో ఈ కుట్ర గుట్టు వీడింది. చంద్రబాబు, లోకేశ్ పన్నాగం ప్రకారమే టీడీపీ, ఆ పార్టీ ఎన్నికల ప్రచార బృందాలు ఈ కుట్రకు తెరతీశాయని సీఐడీ నిర్ధారించింది. దాంతో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా లోకేశ్, ఏ 3గా టీడీపీ, ఆ పార్టీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీమ్‌లతోపాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్),(జి), 188, 505(2) రెడ్‌విత్ 120 (బి) కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. కుట్రదారు చంద్రబాబే..అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా ప్రచారం చేయకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతోంది. భూ హక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై పక్కా పన్నాగంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు తెర తీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు పన్నిన కుట్రలన్నీ బెడిసి కొట్టడంతో ఆయనకు దిక్కు తోచడం లేదు.సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలపై టీడీపీ చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రజలు గుర్తించారు. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అపోహలు వ్యాప్తి చేయాలని పథకం వేశారు. లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగంతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.ఈ చట్టం ద్వారా ప్రజల భూములను గుంజుకుంటారని, కబ్జా చేసేస్తారని, పత్రాలు మాయం చేస్తారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని ప్రజలను బెదిరింపులకు గురి చేసేలా ఈ ముఠా దుష్ప్రచారానికి తెగించింది. ఏకంగా ఓటర్లకు ఫోన్లు చేసి మరీ భయాందోళనలకు గురి చేస్తోంది. మంగళగిరితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, చండీఘడ్ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఫోన్లు చేస్తూ హడలెత్తించేందుకు యత్నించారు. టీడీపీకి వంతపాడే ఈనాడు, ఈటీవీ, ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లతోపాటు టీడీపీ సోషల్ మీడియా విభాగం పక్కా పన్నాగంతో ఈ దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ఈసీ ఆదేశాలతో..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ కాల్ రికార్డింగులతోపాటు ఇతర ఆధారాలను అందచేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఐవీఆర్ఎస్ కాల్స్, ఇతర ఆధారాలను పరిశీలించి విశ్లేషించిన సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ కుట్ర వెనుక చంద్రబాబు, లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగం కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చారు.టీడీపీ కార్యాలయానికి నోటీసులుల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం వెనుక చంద్రబాబు, లోకేశ్ తదితర కుట్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఐడీ బృందం ఆదివారం నోటీసులు అందించేందుకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేరు. పార్టీ ప్రధాన కార్యాలయం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో సీఐడీ అధికారులు ఫోన్లో మాట్లాడి కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించారు.టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగం ప్రతినిధులు సోమవారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్‌తోపాటు ఇతర టీడీపీ నేతలను కూడా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.నేరపూరిత కుట్రే.. నియమావళికి విరుద్ధంకఠిన సెక్షన్ల కింద కేసు నమోదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే కాకుండా నేరపూరిత కుట్రగా సీఐడీ నిర్ధారించింది. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఎన్నికల లబ్ధికి యత్నించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుతంత్రం పన్నినట్టు నిగ్గు తేల్చింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్),(జి), 188, 505(2) రెడ్‌విత్ 120(బి) కింద అభియోగాలు నమోదు చేసింది. 171(ఎఫ్)(జి): ఎన్నికల్లో అసత్య ప్రచారం, అభ్యంతకరమైన రీతిలో ప్రచారం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నడం. 188: ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నడం505(2): అసత్య ప్రచారం ద్వారా సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టడం, సామరస్య వాతావరణానికి విఘాతం కల్పించడం, పరస్పర శతృత్వాన్ని ప్రేరేపించడం.120(బి): కుట్రపూరితంగా వ్యవహరించడం, నేరానికి పాల్పడటం.టీడీపీ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వండితమ పార్టీపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం మర్నాడే స్పందించింది. ఐవీఆర్ కాల్స్ ద్వారా వైఎస్సార్సీపీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన జరిపి ఎన్నికల నియమావళి మేరకు తగిన చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.స్వయంగా లోకేశ్ దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచార కుట్రను నారా లోకేశ్ స్వయంగా అమలు చేయడం గమనార్హం. చట్టం గురించి అవాస్తవాలు, అభూత కల్పనలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా లోకేశ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఐవీఆర్ కాల్స్‌గా ఓటర్ల సెల్ ఫోన్లకు వస్తున్నాయి. టీడీపీ పేరిట వస్తున్న ఈ ఐవీఆర్ఎస్ కాల్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీ శనివారం ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ ఆదివారం ఉదయం కేసు నమోదు చేసింది.అయినా సరే ఆదివారం రాత్రి కూడా లోకేశ్ మాటలతో ఐవీఆర్ కాల్స్ రావడం గమనార్హం. 7313771502 అనే నంబర్ నుంచి లోకేశ్ కాల్ రికార్డింగులు ఓటర్ల సెల్ ఫోన్లకు వచ్చాయి. ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా టీడీపీ ఎంతగా బరితెగించిందో స్పష్టమవుతోంది. లోకేశ్‌ను ఏ2గా పేర్కొంటూ దీనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా స్వయంగా లోకేశ్ మాట్లాడి రికార్డ్ చేసిన కాల్స్ రావడంతో ఈ కేసులో తీవ్రత మరింత పెరిగింది. -
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్ టూ సేమ్! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్ అయితే ‘మీ భూములు జగన్ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్ చేసిన వారికి... ‘దిసీజ్ ప్రైవేట్ వీడియో’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు. గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు. చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్ హయాంలో వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు. ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్ పాస్ పుస్తకంలోగానీ ఆన్లైన్ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. -
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.