చంద్రబాబు రాజకీయ క్రీడకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం బలి
భూముల వ్యవస్థ స్వరూపమే మారిపోయే చట్టంపై దుష్ప్రచారం
అమ్మే వారికి, కొనేవారికి భరోసా కల్పిస్తుంటే మోకాలొడ్డిన వైనం
క్లియర్ టైటిల్‌తో ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంటే వక్రభాష్యం
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా అపోహలు సృష్టించిన కూటమి
భూములు లాగేసుకుంటారని, ఒరిజినల్ ఆస్తి పత్రాలు ఇవ్వరని అబద్ధాలు ప్రచారం
90 దేశాల్లో అమల్లో ఉన్న చట్టంపై రాజకీయ విషం చిమ్మిన కూటమి
అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలన్న నీతి ఆయోగ్
ప్రజలకు మేలు చేసే చట్టంపై ఎన్నికల్లో రాజకీయం చేసి లబ్ధి పొందిన కూటమి
అస్తవ్యస్తమైన భూముల విధానమే కొనసాగించేలా ల్యాండ్ టైట్లింగ్ రద్దుకు మంత్రివర్గం సిఫారసు
భూమి అమ్మే వారికి, కొనే వారికి ఒక భరోసా కల్పించేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. పక్కాగా సర్వే చేసి.. స్పష్టంగా హద్దులు చూపిస్తూ క్లియర్ టైటిల్‌తో ఆ భూమికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం ఆహా్వనించదగిన పరిణామం. భూమికి ఏ ఇబ్బందీ రాకుండా ఇన్సూ్యరెన్స్ చేసినట్లుగా భావించవచ్చు. ఇదివరకు ఎక్కడా దేశంలో భూములకు ఇలాంటి భరోసా లేదు.
రాష్ట్రంలో అది సాకారం కావడానికి వేలాది మంది సర్వేయర్లను నియమించి, అధునాతన సాంకేతికను ఉపయోగించి సర్వేకు శ్రీకారం చుట్టింది. ‘వైఎస్ జగన్‌కు ముందు.. ఆ తర్వాత..’ అని స్పష్టంగా జరిగిన మేలును కళ్లకు కట్టేలా, ప్రభుత్వం ఇస్తున్న క్లియర్ టైటిల్‌కు గుర్తుగా కొత్తగా సర్వే చేసి ఫొటోతో ఇవ్వడంపై ఎల్లో గ్యాంగ్ రాద్ధాంతం చేయడం దుర్మార్గం. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసమేనని స్పష్టమవుతోంది.
సాక్షి, అమరావతి: దేశమంతా అమలు కావాలని కోరుకుంటున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు రాజకీయ క్రీడకు బలైపోయింది. 90 దేశాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఉపయోగించుకుని కూటమి పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందాయి. భూములు పోతాయనే దారుణమైన ప్రచారంతో ప్రజలను భయకంపితుల్ని చేశారు.
ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు తాము మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చంద్రబాబు, కూటమి పార్టీలు భయంకరమైన కుట్రలు చేశాయి. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించారు. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరని పచ్చి అబద్ధాన్ని విస్తతంగా ప్రచారం చేసి ప్రజలను వంచించారు. నిజానికి సంవత్సరం నుంచి 9.58 లక్షల స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాయి.
వాటన్నింటికీ సంబంధింత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు. 15.91 లక్షల ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలానే ఇచ్చారు. ఈ–స్టాంపింగ్‌పైనా ఎడతెగని దు్రష్పచారం చేసి జిరాక్స్ కాపీలు ఇస్తారని, ఆస్తి యజమానుల వారసులను అధికారులే నిర్ణయిస్తారని దారుణంగా వక్రీకరించారు. అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వ నిర్ధారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తప్పుగా చిత్రీకరించారు.
సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనప్పటికీ నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ అన్యాయంగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజల్లో ఒక రకమైన భయానకం సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలు చేశారు.
అసెంబ్లీలో మద్దతిచ్చి ఎన్నికల్లో వ్యతిరేకించిన టీడీపీ
ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్‌గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారు చేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని తయారు చేసింది.
ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటి పీఏసీ ఛైర్మన్, ప్రస్తుత ఆరి్థక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని అసెంబ్లీలో స్వాగతించారు. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్టుమెంట్æ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా, ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి శాఖలన్నీ 3 సంవత్సరాలు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశాయి.
ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకూ వ్యతిరేకంగా ఈ చట్టం లేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై టీడీపీ, కూటమి పార్టీలు, ఎల్లో మీడియా దారుణంగా దుష్ప్రచారం చేసి ప్రజలను భయకంపితుల్ని చేశాయి.
తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ విషయం ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న చట్టాన్ని, దేశం మొత్తం రావాలంటున్న చట్టాన్ని కేవలం రాజకీయం కోసం చంద్రబాబు బలి చేశారు. అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానించారు.
దుష్ప్రచార హోరులో వాస్తవాలు కనుమరుగు
నిజానికి ప్రజల ఆస్తులకు మరింత భద్రత కల్పించడానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని చేసుకోవాలని 2019లో నీతి అయోగ్ అనేకసార్లు చెప్పింది. అందుకు సంబంధించి ఒక ముసాయిదా చట్టాన్ని కూడా చేసింది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైట్లింగ్ మోడల్ చట్టం చేసింది.
పైగా దీనికి టీడీపీ అసెంబ్లీలో మద్దతు తెలిపింది. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం దాన్ని అడ్డగోలుగా వ్యతిరేకించి రాజకీయం చేసింది. ప్రజలకు మేలు చేసే, రాష్ట్ర భూముల స్వరూపాన్ని, భూమి రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చేసే చట్టాన్ని రాజకీయ మంటల్లో కాల్చివేసి ప్రజలకు తీరని ద్రోహం చేసింది.
ల్యాండ్ టైట్లింగ్ చట్టం వద్దనడం సరికాదు
ల్యాండ్ టైటిల్ గ్యారంటీ చట్టం ద్వారా భూమి హక్కులకు ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. చట్టంలో కొన్ని రకాల సమస్యలు ఉంటే ఉండవచ్చు. కానీ చట్టమే తప్పనడం, దాన్ని వద్దనుకోవడం సరికాదు. 1989 నుంచి ఇలాంటి చట్టం కావాలనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 2004లో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికి 3 ముసాయిదా చట్టాలు కూడా తయారు చేసింది. కానీ చట్టరూపం దాల్చలేదు. అయితే అందుకనుగుణంగా మొదటిసారి చట్టం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో బిల్లు పెట్టారు.
రాజస్థాన్ ప్రయత్నం చేసింది. ఢిల్లీ కూడా అనుకుంది. కానీ ఎక్కడా చట్టం రాలేదు. ఈ చట్టం వస్తే భూమి రికార్డుల్లో స్పష్టత వస్తుంది. ఒకసారి రికార్డులో పేరు ఎక్కితే రైతుకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుంది. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి భూ విధానం ఉందో మనకు అలాగే ఉంటుంది. ప్రపంచం అంతా కోరుకుంటున్న మార్పు అది. దీనివల్ల భూ యజమానికి భద్రత పెరగడమే కాకుండా, భూమి విలువలు కూడా పెరుగుతాయి. ఆ భూములపై లావాదేవీలు సులువవుతాయి.
హక్కులు పోతాయి, భూములు బలవంతంగా లాక్కుంటారు, ఆక్రమిస్తారనే అంటున్నారు. కానీ ఈ చట్టం ఉద్దేశం అది కాదు. అది జరగదు కూడా. ఈ చట్టం గురించి దేశంలో 40 ఏళ్లుగా రకరకాల కమిటీలు, నిపుణులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అన్నీ అయిన తర్వాతే ఈ విధానాన్ని తీసుకువచ్చారు. – సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment