త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్‌ యాప్‌.. ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

RBI Govt Bonds: త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్‌ యాప్‌..

Published Sat, Apr 6 2024 12:40 PM

RBI To Launch Mobile App For Investment In Govt Bonds - Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ యాప్‌తో ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/ కొనడం చేసే వీలుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: హోమ్‌ రోబోటిక్స్‌ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..?

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను తెలియజేసే క్రమంలో యాప్‌కు సంబంధించిన అంశాన్ని దాస్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి అర్ధభాగంలోనే రూ.7.5 లక్షల కోట్లు సేకరించాలనుకుంటోంది.

Advertisement
Advertisement