వసంత కృష్ణప్రసాద్ కుటుంబానిది పదవీ కాంక్షతో పార్టీ మారే చరిత్ర
వైఎస్సార్ సీపీలో గ్రూపులను పోషించి పార్టీని విచి్ఛన్నం చేసేందుకు కుట్ర
ఆయన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టి సీటు ఇవ్వని పార్టీ అధిష్టానం
ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని టీడీపీలో చేరినట్లు వసంత అసత్య ప్రచారం
జి.కొండూరు: పదవీ కాంక్షతో తరచూ పార్టీలు మారే ఆనవాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణప్రసాద్ అబద్ధ ప్రచారాలను తలకెత్తుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తనకు అత్యంత ప్రియమైన టీడీపీతో గత ఐదేళ్లూ గుట్టుగా సంబంధాలు కొనసాగించారు.
మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని విచి్ఛన్నం చేయడమే లక్ష్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించి వెన్నుపోటు రాజకీయాలతో చెలరేగిపోయారు. వసంత తీరును పసిగట్టిన వైఎస్సార్ సీపీ అధిస్టానం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న క్రమంలో పరువు దక్కించుకునేందుకు ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన పాచిక పారలేదన్న దుగ్ధతో రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పారీ్టపై అసత్యాలు గుప్పిస్తున్నారు.
ఇన్‌చార్జ్‌లదే పెత్తనం
వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే తన సొంత వ్యక్తులను మండలానికి ఒకరు చొప్పున ఇన్‌చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేతో ఏ పని చేయించుకోవాలన్నా ఇన్‌చార్జ్‌లను సంప్రదించాల్సి రావడంతో తమకు విలువ లేదంటూ కొందరు సీనియర్ నాయకులు పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీకి దూరంగా జరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కేడర్‌ను గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం జంపింగ్‌లు చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు.
దీంతో ప్రతి గ్రామంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక గ్రూపుగా, పదవులు పొందిన నాయకులు మరో గ్రూపుగా విడిపోయారు. ముందస్తు కుట్రలో భాగంగా ఈ గ్రూపులను సమన్వయం చేయకుండా అలానే వదిలేశారు. వసంతపై అసంతృప్తితో పారీ్టలోని రెండో కేడర్‌గా ఏర్పడిన నాయకులకు మంత్రి జోగి రమేష్ అండగా నిలబడ్డారు. దీనిని సాకుగా చూపుతూ జోగి రమేష్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ అసత్య ప్రచారం చేశారు. తన కుట్రలో భాగంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సైతం ప్రభుత్వంపై విమర్శలు చేయించారు.
సీటిచ్చినా పార్టీ మారారంట..!
ఐదేళ్లు మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారం¿ోత్సవాల్లో ఫొటోలకు ఫోజులిచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు మాట మార్చారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగనందుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సామాన్యుడు కావ డంతో ఆయనపై మాట్లాడేందుకు ఏమీ లేక నేరుగా ముఖ్యమంత్రిపై రోజూ అరిగిపోయిన రికార్డులా పచ్చి అబద్ధాలను గుప్పిస్తున్నారు.
ఆయన వ్యాఖ్యలు టీడీపీ కేడర్‌కు సైతం విసుగుతెప్పిస్తున్నాయి. ఐదేళ్లపాటు తాను చేసిన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టే వైఎస్సార్ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తోందని గుర్తించిన వసంత, పదవీ కాంక్షతో పార్టీ మారారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నా రని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment