Venkata Krishna Prasad
-
Political Corridor: ఇక జనంతో పనిలేదు.. ఓన్లీ దోచుకోవడమే..
-
అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
జి.కొండూరు: పదవీ కాంక్షతో తరచూ పార్టీలు మారే ఆనవాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణప్రసాద్ అబద్ధ ప్రచారాలను తలకెత్తుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తనకు అత్యంత ప్రియమైన టీడీపీతో గత ఐదేళ్లూ గుట్టుగా సంబంధాలు కొనసాగించారు. మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని విచి్ఛన్నం చేయడమే లక్ష్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించి వెన్నుపోటు రాజకీయాలతో చెలరేగిపోయారు. వసంత తీరును పసిగట్టిన వైఎస్సార్ సీపీ అధిస్టానం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న క్రమంలో పరువు దక్కించుకునేందుకు ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన పాచిక పారలేదన్న దుగ్ధతో రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పారీ్టపై అసత్యాలు గుప్పిస్తున్నారు. ఇన్‌చార్జ్‌లదే పెత్తనం వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే తన సొంత వ్యక్తులను మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేతో ఏ పని చేయించుకోవాలన్నా ఇన్‌చార్జ్‌లను సంప్రదించాల్సి రావడంతో తమకు విలువ లేదంటూ కొందరు సీనియర్ నాయకులు పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీకి దూరంగా జరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కేడర్‌ను గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం జంపింగ్‌లు చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. దీంతో ప్రతి గ్రామంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక గ్రూపుగా, పదవులు పొందిన నాయకులు మరో గ్రూపుగా విడిపోయారు. ముందస్తు కుట్రలో భాగంగా ఈ గ్రూపులను సమన్వయం చేయకుండా అలానే వదిలేశారు. వసంతపై అసంతృప్తితో పారీ్టలోని రెండో కేడర్‌గా ఏర్పడిన నాయకులకు మంత్రి జోగి రమేష్ అండగా నిలబడ్డారు. దీనిని సాకుగా చూపుతూ జోగి రమేష్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ అసత్య ప్రచారం చేశారు. తన కుట్రలో భాగంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సైతం ప్రభుత్వంపై విమర్శలు చేయించారు.సీటిచ్చినా పార్టీ మారారంట..! ఐదేళ్లు మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారం¿ోత్సవాల్లో ఫొటోలకు ఫోజులిచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు మాట మార్చారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగనందుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సామాన్యుడు కావ డంతో ఆయనపై మాట్లాడేందుకు ఏమీ లేక నేరుగా ముఖ్యమంత్రిపై రోజూ అరిగిపోయిన రికార్డులా పచ్చి అబద్ధాలను గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ కేడర్‌కు సైతం విసుగుతెప్పిస్తున్నాయి. ఐదేళ్లపాటు తాను చేసిన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టే వైఎస్సార్ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తోందని గుర్తించిన వసంత, పదవీ కాంక్షతో పార్టీ మారారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నా రని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘అప్పుడు దోచేశావ్.. ఇప్పుడు కొరత అంటున్నావ్’
సాక్షి, మైలవరం: అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా ఇసుక దోచేసిన దేవినేని ఉమా ఇప్పుడు కొత్తగా ఇసుక కొరత అంటూ ధర్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇసుక కోసం ధర్నాలు చేసే అర్హత దేవినేని ఉమాకు లేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇసుక నుంచి తైలంబు ఎలా తీయవచ్చో దేవినేని ఉమాకు తెలిసినంతగా రాష్ట్ర్రంలో ఎవరికి తెలియదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇసుక కోసం ధర్నాలు చేస్తున్నారు’అని అన్నారు. ‘మైలవరం నియోజకవర్గ పరిధిలో నీ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ దందాపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి మరిచిపోయావా’అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి హోదాలో ఉన్న ఉమా అధికారం దుర్వినియోగంతోనే ఆ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని వెల్లడించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. తప్పు మీద తప్పులు చేస్తున్నారని చురకలంటించారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా అందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. -
ముగ్గురిని బలిగొన్న అతివేగం
మరొకరి పరిస్థితి విషమం మృతుల్లో నవదంపతులు నకిరేకల్ సమీపంలోదుర్ఘటన మృతులంతా ఖమ్మం జిల్లా వాసులు నకిరేకల్, న్యూస్‌లైన్ : అతివేగం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారును మితిమీరిన వేగంతో నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు నవదంపతులున్నారు. ఈ విషాదకర ఘటన నకిరేకల్ బైపాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బుక్యవరపు వెంకటకృష్ణప్రసాద్(31) అతని భార్య బుక్యవరపు సౌమ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటకృష్ణప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, సౌమ్య మల్లారెడ్డి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుభకార్యం ఉండటంతో వీరిద్దరూ స్వగ్రామం వెళ్లారు. తిరుగుప్రయాణంలో వెంకటకృష్ణప్రసాద్ బావ సత్తుపల్లికి చెందిన తిన్నవల్లి చైతన్యకుమార్-విష్ణుప్రియ దంపతులతో కలిసి కారులో ఇల్లందు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉదయం 7 సమయంలో నకిరేకల్ బైపాస్ వద్దకు రాగానే కారు నడుపుతున్న వెంకటకృష్ణప్రసాద్ అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న సౌమ్య అక్కడికక్కడే మృతి చెందగా వెంకటకృష్ణప్రసాద్, అతని బావ తిన్నవల్లి చైతన్యకుమార్(31), విష్ణుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందు తూ వెంకటకృష్ణప్రసాద్, చైతన్యకుమార్‌లు మృతి చెందారు. విష్ణుప్రియ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద స్థలిని నకిరేకల్ సీఐ నాగేశ్వర్, ఎస్ఐ ప్రసాద్‌రావులు సందర్శించారు. సౌమ్య మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నాలుగు నెలల క్రితమే వివాహం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెంకటకృష్ణప్రసాద్‌కు కరీంనగర్‌కు చెందిన సౌమ్యతో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. శుభకార్యం నిమిత్తం ఇల్లందుకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించింది. వారిద్దరి మృతితో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.