ఎన్నికల బాండ్ల ఎఫెక్ట్‌.. భారీగా పడిపోయిన షేర్‌ ధర | Sakshi
Sakshi News home page

ఎన్నికల బాండ్ల ఎఫెక్ట్‌.. భారీగా పడిపోయిన షేర్‌ ధర

Published Mon, Mar 11 2024 2:45 PM

Supreme Court Dismissed SBI Plea Seeking Extension Of Electoral Bonds - Sakshi

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్‌ బ్యాంకును ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు వెల్లడించేందుకు ఎస్‌బీఐ అదనపు సమయం కావాలని గతంలోనే సుప్రీం కోర్టును కోరింది. కానీ అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సదరు బ్యాంకు షేర్ల విక్రయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

సోమవారం ఉదయం నుంచి ఎస్‌బీఐ షేర్ల అమ్మకాలు కోనసాగుతున్నాయి.  జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో షేర్‌ ధర మధ్యాహ్నం 2:32 వరకు 2శాతం క్షీణించింది. సోమవారం ఉదయం రూ.788.5 ధరతో ప్రారంభమైన షేర్‌.. మధ్యాహ్నానికి రూ.16 కోల్పోయింది. ప్రస్తుతం రూ. 772 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది.

ఇదీ చదవండి: మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్‌!

ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడించేందుకు ఎస్‌బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. మార్చి 12లోగా విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా వెల్లడించాలని ఈసీని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement