సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జన్నాయిగూడ గ్రామంలో ఫ్యాబ్ సిటీ, ఫార్మసిటీ వల్ల భూములు కోల్పోయిన స్థానికులతో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ (కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి), ధరణి కమిటీ చైర్మన్ కోదండ రెడ్డిలు భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ.. సమస్యను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బోధ మాధవరెడ్డి, పుంటి కూర చంద్రశేఖర్‌రెడ్డి, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్‌తో పాటు ఆయా గ్రామల రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment