Bhopal Crime News: Father Molested And Killed His Daughter - Sakshi
Sakshi News home page

కూతురిపైనే పలు మార్లు అత్యాచారం.. మాట వినలేదని ఆమె శరీరాన్ని..

Published Tue, Mar 29 2022 9:17 AM

Man Accused Of Abusing Teen Girl Killed By Victim Father - Sakshi

భోపాల్‌: ఎన్ని చట్టలు తెచ్చినా దేశంలో యువతులు, మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని కుటుంబ సభ్యులే మృగాలుగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వావి వరసలు మరచిన  ఓ తండ్రి క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అనేక‌సార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘటన మధ్య‍ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఖండ్వా జిల్లాలోని సాక్తాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి(14) త‌న తండ్రి త్రిలోక్‌చంద్(55)తో క‌లిసి ఉంటోంది. ఈ క్రమంలో తన కూతురిపైనే కన్నేసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురునే బెదిరింపులకు గురిచేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఇటీవల ప్రతిఘటించడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన త్రిలోక్‌చంద్‌ ఆమెపై దాడి చేశాడు. ఆమెను కత్తితో నరికి.. శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ శ‌రీర భాగాల‌ను గోనె సంచుల్లో క‌ట్టేశాడు.

అనంతరం తన బంధువు సాయంతో గోనె సంచిని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న అజ్మన్‌ నదిలో పారేశాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు వ్యక్తలు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి రాకేశ్‌ పెండ్రో తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement