ఢిల్లీ/ గుంటూరు, సాక్షి: కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ లేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇవాళ ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపిన బీజేపీ అగ్రనేతలు.. మోదీనే మరోసారి ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు కూడా. అయితే కీలకమైన మంత్రి బెర్తుల పంపకాలపై ఇవాళ్టి భేటీలో ప్రస్తావనేం రాలేదని సమాచారం.
మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కేబినెట్‌లో తమకు తగిన్ని మంత్రి పదవులు, కీలక శాఖలు ఆశిస్తున్నాయి. కేబినెట్ కూర్పునకు ఇంకా టైం ఉండడంతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. నాలుగు కేబినెట్ బెర్తులు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ నుంచి మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రామ్మోహన్ నాయుడితో పాటు ఏపీ బీజేపీ చీఫ్.. బీజేపీ నుంచి రాజమండ్రి ఎంపీగా నెగ్గిన దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన నుంచి బాలశౌరికి కేబినెట్‌లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో బెర్త్ కోసం గట్టి పోటీనే ఉండొచ్చని తెలుస్తోంది.
ఆశావహుల లిస్ట్ పెద్దదే
గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్
విశాఖ ఎంపీ భరత్,
అమలాపురం ఎంపి జీఎం హరీష్(మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు),
ఒంగోలు ఎంపీ మాగుంట,
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి,
అనంతపురం ఎంపి పార్ధసారధి.. ఇంకా కొన్ని పేర్లు ప్రధానంగా వినవస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment