173 కేసుల్లో నిందితులు.. పోలీసులు పక్కా స్కెచ్‌.. చివరికి.. | Sakshi
Sakshi News home page

173 కేసుల్లో నిందితులు.. పోలీసులు పక్కా స్కెచ్‌.. చివరికి..

Published Fri, May 5 2023 6:43 PM

Transformer Copper Coil Thieves Gang Busted In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాన్స్‌ఫార్మర్‌ల కాపర్‌ కాయిల్స్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 60 కిలోల కాపర్ కాయిల్స్‌, టాటా ఇండికా కారు, బజాజ్ పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధి సీసీఎస్ క్రైం డీసీపీ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో నెల రోజుల పాటు శ్రమించి మూడు నాలుగు కమిషనరేట్‌లో పరిధిలో 173 కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడు మంది దొంగల గ్యాగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. 

ప్రధానంగా ఈ ముఠా దొంగలించిన సొత్తు చిన్నది కావచ్చు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు చాలా నష్టం చేకురుస్తుందని డీసీపీ తెలిపారు. ఏడుగురు నిందితులు చేసిన దొంగతనాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60, సైబరాబాద్ పరిధిలో 7, వికారాబాద్‌లో 68,సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 22 మొత్తం ఈ ముఠా 306 ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసినట్టు సీపీ వివరించారు.
చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో..

ప్రధాన నిందితుడు సహదేవ్ హిజ్రా, అభిమన్యు రాజ్ బార్, నందులాల్ రాజ్ బార్, రాహుల్ రాజ్ బార్, రాంచందర్, కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్, తులుగు రమణ రెడ్డి, రాంజానీ జయశ్రీలను అరెస్ట్‌ చేయగా, రాహుల్ రాజ్ బార్, రాంచందర్ కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్ పరారీలో ఉనట్లు సీపీ తెలిపారు. నెల రోజులు కష్టపడి కేసును చేధించిన అధికారులను సీపీ అభినందించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement