
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా యూఎస్‌ఎతో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్‌ఎ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
యూఎస్‌ఎ తమ తొలి మ్యాచ్ ఆడిన జట్టుతోననే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్ ఏకంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇక పాకిస్తాన్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా.. యూఎస్‌ఎ జట్టు మాత్రం తమ మొదటి మ్యాచ్‌లో కెనడాపై అద్బుత విజయం సాధించింది.
తుది జట్లు
పాకిస్తాన్: బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్
యునైటెడ్ స్టేట్స్ : స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్