Holi 2024 యాంకర్‌ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట! | Sakshi
Sakshi News home page

యాంకర్‌ సుమ ఫన్నీ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!

Published Mon, Mar 25 2024 12:53 PM

Holi 2024 anchor suma kanakala prank video goes viral - Sakshi

 సుమ హోలీ సందేశం చూశారా?  

హోలీ సందర్భంగా సుమ ప్రాంక్‌ వీడియో 

యాంకర్‌ సుమ గురించి ప్రత్యే​క పరిచయం అవసరం లేదు. యాంకరింగ్‌, యాక్టింగ్‌, స్టేజ్‌ షోలు,సినిమాలు..  ఇలా ప్రతీ అంశంలోనూ  నా  స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు  వెన్నతో పెట్టిన విద్య.  దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్‌ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్‌. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

ముఖ్యంగా నీటిని వేస్ట్‌ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్‌ చేయడం విశేషం.  ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు  ఒకరు కామెంట్‌ చేయగా,  ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్‌.. హ్యాపీ హోలీ  శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్‌ చేయడం గమనార్హం.

Advertisement
Advertisement