Sakshi News home page

NASA భారత విద్యార్థులకు నాసా అవార్డులు

Published Tue, Apr 23 2024 11:08 AM

Indian students bag NASA awards for Human Exploration Rover Challenge - Sakshi

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్‌లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ  ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి.  

ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. 

కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్‌కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో  తన ప్రతిభను చాటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement