పోయిన వాలెట్‌ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..? | Sakshi
Sakshi News home page

పోయిన వాలెట్‌ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?

Published Thu, Dec 28 2023 3:59 PM

Lost Wallet Returned To Its Owners After 65 Years - Sakshi

కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్‌ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్‌ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్‌ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే..

అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్‌ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్‌ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో  వాలెట్‌ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్‌ స్ట్రిప్‌లేని క్రెడిట్‌లు, సినిమా టిక్కెట్‌, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్‌ యజమాని క్రిస్‌ ఎస్కోబార్‌ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్‌ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు  వాలెట్‌లో ఉన్న టికెట్‌ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్‌ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్‌.

అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్‌ ఎస్కోబార్‌కి. దీంతో ఆ వ్యాలెట్‌లో ఉన్న లైసెన్స్‌ కార్డుల ఆధారంగా వ్యాలెట్‌ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్‌బ్రేత్‌గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్‌ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్‌ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్‌లో సోధించగా కల్‌బ్రెత్‌ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్‌ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్‌బ్రెత్‌ పేరు మీద కల్‌బ్రెత్‌ కప్‌ అనే గోల్ఫ్‌ టోర్నమెంట్‌ వెబ్‌సైట్‌ను కనుగొంటారు.

అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్‌ కుమార్తె థియా చాంబర్‌లైన్‌ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్‌ని అందజేస్తాడు క్రిస్‌. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్‌ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ నోట్‌లు కనుగొంటుంది. ట్విస్ట్‌ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్‌ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్‌ యజమాని క్రిస్‌ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్‌బ్రేత్‌కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్‌ కలెబ్రెత్‌ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్‌. 

(చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చే‍యగలవు!)

Advertisement
Advertisement