రోజుకి 20 నిమిషాలే పనిచేస్తాడు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు..! | Sakshi
Sakshi News home page

రోజుకి 20 నిమిషాలే పనిచేస్తాడు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు..!

Published Thu, Apr 18 2024 6:28 PM

Man Bring In More Than Rs 3 Crore A Year Works 20 Minutes A Day - Sakshi

చాలామంది గంటలకొద్ది పనిచేసిన సంపాదన మాత్రం అతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకొందరూ పడే కష్టం చూస్తే బాధేస్తుంది. వాళ్ల సంపాదన కనీసం రోజు గడవడానికి కూడా సరిపోదు. కానీ ఈ వ్యక్తి రోజుకి మహా అయితే 20 నిమిషాలకు మించి పనిచేయడు. కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎలా? అతడి విజయ రహస్యం ఏంటీ అంటే..

ఓర్లాండ్‌ నివాసి ప్రాన్సిస్కో రివెరా ఫిబ్రవరి 2023లో ఆన్‌లోన్‌ ట్యూటర్‌గా పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూ, మరోవైపు పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవాడు. అయితే అది అతనికి పెద్దగా వర్కౌట్‌ అవ్వలేదు. రోజంతా కష్టపడ్డా సంపాదిస్తుంది ఎంత అనే ఫీల్‌తో ఉండేవాడు. ఏదైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం తెగ అన్వేషించేవాడు రివెరా. అలా యూట్యూబ్‌లో బిజినెస్‌కి సంబంధించిన  ప్రింట్‌ ఆన్‌ డిమాండ్‌(పీవోడీ) సైడ్‌ హాస్లర్‌ యూట్యూబ్‌ వీడియోలతో ప్రేరణ పొంది ఆర్గానిక్‌ క్యాండిల్స్‌ తయారు చేసి విక్రయించే ఎట్సీ((Eassiest Way To Start(Ety)) అనే దుకాణాన్ని పెట్టానలుకున్నాడు.

ముదుగా ఆర్గానిక్‌ కొవ్వుత్తులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఎలా విక్రయించాలి, ఎలా ప్రొడక్ట్‌లని డిజైన్‌  చేయడం అనేవి ఆ పీవోడీ వీడియోల ద్వారా పూర్తి పరిజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కూడా బిజినెస్‌ బాగా విస్తరించేలా చేశాడు. ఇలా అతడి ఎట్సీ దుకాణం గతేడాది సుమారు రూ. 3.8 కోట్లు లాభాలు అందుకుంది. ప్రతి అమ్మకంలో దాదాపు 30% నుంచి 50% లాభలను అందుకున్నామని రివెరా చెప్పుకొచ్చాడు. తాను కేవలం మార్కెటింగ్‌కి, ప్రింట్‌ఫై సేవల కోసమే ఖర్చు చేస్తున్నాని తెలిపారు.

తాను కొన్ని రోజులు 20 నిమిషాలే పనిచేస్తానని, ఒక్కోసారి మాత్రం రెండు గంటల వరకు పని చేస్తానని అది కూడా కొత్త ట్రెండ్స్‌పై పరిశోధన చేయడం,  లేబుల్స్‌ డిజైన్‌ చేయడానికి ఇంత టైం పడుతుందని చెప్పుకొచ్చారు. మిగిలిన సమయం అంతా సంగీతంపై దృష్టి పెడతానని అన్నారు. తానిప్పుడూ గతంలో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, తక్కువే పనిచేస్తున్నానని ఆనందంగా చెప్పుకొచ్చారు రివెరా. 

అంతేగాదు మీరు 9 టు 5 జాబ్‌లో ఉండి సరైన సంపాదన లేనప్పుడూ మంచి ఆదాయమార్గం వైపు దృష్టిసారించడం ఓ స్టాండర్డ్‌ని తీసుకోవడం చేయాలి చెబుతున్నాడు రివెరా. కాగా ప్రింట్‌ ఆన్‌ డిమాండ్‌(పీవోడీ) సైడ్‌ హాస్టల్స్‌ కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవాళ్లకు ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచిది, ఎలా ప్రారంభించాలి, ట్రైనింగ్‌ వంటివి అన్ని ఔత్సాహికులకు నేర్పించే యూట్యూబ్‌ ఛానెల్‌. ఆయా వ్యక్తులకు వ్యాపారానికి కావాల్సిన గైడన్స్‌ ఇవ్వడమే గాక మార్కెటింగ్‌ సంబంధించిన సహాయసహకారాలు కూడా అందిస్తుంది. దీని సాయంతో ఎంతో మంది ఈజీగా ఆదాయాన్ని గడించి బిజినెస్‌లతో దూసుకుపోయిన వారెందురో ఉన్నారు కూడా. 

(చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్‌ చేయకూడదట..!)

Advertisement

తప్పక చదవండి

Advertisement