Watch: Wayanad Student Drumming On Bench For Teacher Sings Video Goes Viral - Sakshi
Sakshi News home page

Wayanad Student Viral Video: క్లాస్‌రూంలో టీచర్‌ పాడుతుంటే ఈ విద్యార్థి ఏం చేశాడో చూడండి..

Published Wed, Jul 5 2023 5:03 PM

Wayanad Student Drumming On Bench For Teacher Sings Video Goes Viral - Sakshi

కేరళకు చెందిన ఓ  విద్యార్థి అద్భుతంగా  డ్రమ్ము  వాయిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా  మారింది. కేరళలోని వయనాడ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో అంజనాకుమార్‌ అనే టీచర్‌ ఓ జానపద గీతాన్ని క్లాస్‌రూంలోనే ఆలపించగా, ఆ పాట రిథమ్‌కు తగ్గట్టుగా స్కూల్‌  బెంచ్‌ మీదే అభిజీత్‌ అనే విద్యార్థి అత్భుతంగా వాయించాడు.

ఈ వీడియోను క్లాస్‌ టీచర్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా 24గంటల్లోనే లక్షకు పైగా లైక్స్‌ వచ్చాయి. టీచర్‌ పాటకు అభిజీత్‌ అద్భుతంగా డ్రమ్‌ వాయించాడంటూ నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. చిన్నారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్టార్లను తయారుచేసేదే టీచర్లే అంటూ కామెంట్స్‌  చేస్తున్నారు.

ఇక అభిజీత్‌  ప్రతిభకు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల నుంచి పెత్త ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మట్టిలో మాణిక్యం అంటూ అతడి టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement