వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం తథ్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం తథ్యం

Published Tue, Apr 23 2024 8:20 AM

ఎమ్మెల్యే గిరిని అభినందిస్తున్న విప్‌ అప్పిరెడ్డి పార్టీ నేతలు - Sakshi

పట్నంబజారు: రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం తథ్యమని శాసనమండలి విప్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా నియమితులైన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ను శ్యామలానగర్‌లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్‌ అప్పిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా.. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పని చేసే సమర్థ్ధుడైన ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ని పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా నియమించటం ఎంతో సముచితమన్నారు. ఎమ్మెల్యేగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయన పనితీరుకు చక్కని నిదర్శనమన్నారు. అత్యంత కీలకమైన దశలో ఎమ్మెల్యే గిరి నేతృత్వంలో పార్టీ గుంటూరులో మరింత బలోపేతమై గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని, తూర్పులో షేక్‌ నూరి ఫాతిమా, ప్రత్తిపాడులో బలసాని కిరణ్‌కుమార్‌లు భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు.

● ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ మాట్లాడుతూ కీలకమైన తరుణంలో తనను గుంటూరు నగర అధ్యక్షుడిగా నియమించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు గుంటూరు నగర పరిధిలోకి వచ్చే గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. నాయకులందరినీ కలుపుకొని పని చేస్తానన్నారు. కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తానని తెలిపారు. మద్దాళి గిరికి పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి షేక్‌ నూరిఫాతిమా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), గుంటూరు అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ బందా రవీంద్రనాథ్‌, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), మోతుకూరి వెంకటరత్నం, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు.

గుంటూరు నగర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మద్దాళి గిరి నియామకం సంతోషదాయకం కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి రజిని, నూరిఫాతిమా, బలసానిల గెలుపు ఖాయం శాసనమండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి

Advertisement
Advertisement