US Ex Prez Donald Trump To Make Major Announcement On Nov 15, Know Details - Sakshi
Sakshi News home page

Trump Big Announcement: ఏం చెబుతాడో?.. సంచలన ప్రకటనకు సిద్ధమైన డొనాల్డ్‌ ట్రంప్‌

Published Tue, Nov 8 2022 11:45 AM

US Ex Prez Donald Trump Ready For Major Announcement Soon - Sakshi

అమెరికా వ్యాపార దిగ్గజం, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వచ్చే వారం భారీ ప్రకటనే చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. 

అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ.. సోమవారం ఒహియోలో అభిమానుల కోలాహలం నడుమ ఆయన ప్రసంగించారు. ‘‘రేపు అనేది చాలా ముఖ్యమైంది. అందులో కీలకమైంది ఎన్నికలు. దాని నుంచి తప్పుకోకుండా.. అంటూ అసంపూర్తిగా ముగించి.. ఆపై నవంబర్ 15, మంగళవారం, ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నా’’ అంటూ పేర్కొన్నారు. 

దీంతో ట్రంప్‌ ఏం ప్రకటన చేయబోతున్నాడో అనే చర్చ జోరందుకుంది. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఆయన ప్రకటన చేయబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్‌.. తన ఓటమిని ఏనాడూ అంగీకరించలేదు. అదీగాక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరతానంటూ గత కొన్నినెలలుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా.

ఇదీ చదవండి: చరిత్రలోనే అత్యంత వేడి.. 15వేల మంది మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement