ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Apr 23 2024 8:25 AM

సాయన్‌ దెబర్మకు మొక్క ఇస్తున్న కలెక్టర్‌ - Sakshi

జనగామ రూరల్‌: ఎన్నికల విధుల్లో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులు సాయన్‌ దెబర్మ అన్నా రు. సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి రాగా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా స్వాగతం పలికి పూల మొక్క అందజేశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీ లకులు మాట్లాడుతూ.. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై పరిశీలించి ఎప్పటికప్పు డు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌, డీసీపీ సీతారాం, ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, నోడల్‌ అధికారి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి

ఓటు హక్కు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికా రి వినోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం చౌడారం కేజీబీవీ విద్యార్థులతో స్థానిక బస్టాండ్‌లో ఫ్ల్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. విద్యార్థులకు, ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను విరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు చేసుకున్న వారు జాబితాలో పేర్లు సరిచూసుకో వా లని సూచించారు. ప్రలోభాలాకు లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవా లని కోరారు. డీఈఓ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులు

సాయన్‌ దెబర్మ

Advertisement
Advertisement