ఎండిపోయిన ఆర్డీఎస్‌ ఆనకట్ట | Sakshi
Sakshi News home page

ఎండిపోయిన ఆర్డీఎస్‌ ఆనకట్ట

Published Mon, Apr 8 2024 12:45 AM

ఆర్టీఎస్‌ దుస్థితి ఇది  - Sakshi

రాయచూరు రూరల్‌: గత ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆనకట్టలు ఎండుముఖం కనిపిస్తున్నాయి. నదిలో జల ప్రవాహం తగ్గిపోవడంతో రజోలిబండ డైవర్షన్‌ ఆనకట్ట నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1966లో తుంగభద్ర నదికి అడ్డంగా 31 అడుగుల ఎత్తు, 2690 మీటర్ల పొడవుతో ఆనకట్ట (గోడ)ను నిర్మించారు. నదికి లక్ష క్యూసెక్కుల నీరు వదిలినప్పుడు 17 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటారు. రాష్ట్రంలోని మాన్వి, రాయచూరు తాలూకాలలో ఈ నీటితో పది వేల ఎకరాలు సాగు అవుతుంది. ఇప్పుడు పూర్తిగా ఆనకట్ట ఎండిపోవడంతో మంత్రాలయం, మాధవరం, తుంగభద్ర, తెలంగాణాలోని శాంతి నగర, ఐజ ప్రజలకు తాగునీటి ఎద్దడి నెలకొంది. ఒకవైపు పంటలు పండక తాగునీరు లభించక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నేడు ఆనకట్ట పరిధిలో పూడిక పేరుకుపోవడంతో పాటు అక్రమంగా ఇసుక రవాణా కావడంతో నీటి సామర్థ్యం తగ్గినా అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement